అందుకే నిత్యామీనన్,తాప్సీలతో స్పెషల్ సాంగ్

By Srikanya

హైదరాబాద్ : సినిమా రూపొందించి, విడుదల చేయటం అనేది ఎంత భాధ్యతగా చేయాల్సిన వ్యవహారమో...దాన్ని జనాల్లోకి తీసుకువెళ్లేందుకు చేసే ఏర్పాట్లు సైతం...అంతే గ్రాండ్ గా చేయాలి. లేకపోతే ఇప్పుడున్న జనాలని చేరటం కష్టం. ఇది లారెన్స్ కు తెలుసు. అందుకే ఆయన తన తాజా చిత్రం కాంచన 2 ...తెలుగులో విడుదల లేటైందని గమనించి , ఆ లోటును పూడ్చుకోవటానికి ప్రత్యేక శ్రద్ద తీసుకుని ప్రమోషన్ ప్రారంభింస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే...

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

లారెన్స్‌ తన స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన 'కాంచన 2' మంచి పేరు తెచ్చుకుంది. అదేస్థాయిలో తెలుగులో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రత్యేక ప్రోమో పాటను రూపొందించారు లారెన్స్‌.

సినిమాలో తొలి పాట 'సిలాట్ట మిల్లాట్ట..' అనే పాటతో ప్రత్యేక ప్రొమోను రూపొందించారు. ఇందులో లారెన్స్‌, నిత్యామేనన్‌, తాప్సీలు నటించారు. త్వరలోనే ఈ పాటను విడుదల చేయనున్నారు. అయితే ఈ పాటను సినిమాలో జతచేర్చనున్న విషయాన్ని ఇంకా స్పష్టం చేయలేదు. మరోవైపు చిత్రంలో వీరి ముగ్గరి కాంబినేషన్‌లో పాట లేనందునే దీన్ని రూపొందించినట్లు చిత్రవర్గాలు చెబుతున్నాయి.

A promo song is being shot for Kanchana 2 with nithya

సినిమా విశేషాలకు వస్తే...

మునికి సీక్వెల్‌గా 'గంగ' చిత్రం రూపొంది వారం క్రితం తమిళంలో విడుదలై సూపర్ హిట్ తెచ్చుకుంది. లారెన్స్, తాప్సీ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తెలుగులో నిర్మిస్తున్నారు. వారం క్రితమే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం ఆర్దికమైన ఇబ్బందులతో ఆగిపోయింది.

విడుదల...

అయితే ఇప్పుడు ఆ అడ్డంకులని అధిగమించి విడుదలకు సిద్దమవుతోంది. ఏప్రియల్ 30న విడుదల చేసే అవకాసం ఉందని ఆ మేరకు థియోటర్స్ ని బుక్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే బాలకృష్ణ తాజా చిత్రం లయిన్ ని మే 1 న విడుదల చేసే ఆలోచన విరమించుకుని వేరే డేట్ అనుకుంటేనే ఈ చిత్రం ముందుకు వస్తుందని తెలుస్తోంది. అంటే బాలకృష్ణ లయిన్ రిలీజ్ డేట్ ని బట్టి ఈ రిలీజ్ డేట్ మారే ఆలోచన ఉండే అవకాసం ఉంది. ఈ విషయమై నిర్మాత నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు.

తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ టీజర్ ఇటీవలే విడుదలై సంచలనం సృష్టించింది. మొదట్లో కాంచన-2గా వస్తోందని అన్నారు. కానీ, గంగ పేరుతో రూపొందిన టీజర్ భయపెడుతూ అందరినీ ఆకట్టుకుంది. వైవిధ్యవంతమైన కథ, కథనాలతో రూపొందుతోంది. మరి, ఈ గంగ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

ముని 3 అంటూ టైటిల్‌పై పెట్టి కాంచన-2 అంటూ సినిమాపేరు ఉంచారు. ఓ రకంగా తెలుగు, తమిళంలో రూపొందుతున్న 3వ సీక్వెల్ సినిమాగా చరిత్రలో నిలిచిపోతుంది. ఫస్ట్‌లుక్‌తోనే సినిమాపై అంచనాలు కలిగేలా చేశారు రాఘవ. పసుపుతో నిండిన ఫోటోలో భక్తుని రూపంలో చేతి నిండా గాయాలతో ఉంది ఫస్ట్‌లుక్ ఫోటో. ఇంకా ఈ చిత్రంలో తాప్సీ, నిత్యామీనన్‌లు నటించారు. ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు ఏడాదికి పైగా శ్రమించారు. కాంచన-2కు ఎస్.ఎస్.థమన్ సంగీతం అందించారు.

కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించిన రాఘవ లారెన్స్ ఎన్నో హిట్ చిత్రాలకు డ్యాన్స్ కంపోజ్ చేశారు. తెలుగు, తమిళ చిత్రసీమల్లోని దాదాపుగా అందరు స్టార్ హీరోలతో ఆటాడించాడు. హీరో దర్శకుడిగా స్టెల్, ముని,కాంచన, సినిమాలతో విజయం అందుకున్నారు. దర్శకుడిగా నాగార్జునతో మాస్,డాన్ సినిమాలతో హిట్ కొట్టగా, యంగ్ రెబల్‌స్టార్‌తో చేసిన రెబల్ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. మళ్ళీ ఇప్పుడు కాంచన-2తో మన ముందుకొస్తున్నారు. హరర్ కామెడీ చిత్రాలతో విజయాన్నందుకున్న రాఘవ కాంచన-2తో అంచనాలను అందుకుంటాడో లేదో వేచి చూడాలి.

రాఘవ లెరెన్స్, తాప్సీ జంటగా నటిస్తున్న ఈ భారీ చిత్రానికి ఫోటోగ్రఫీ: కిచ్చా, సంగీతం: థమన్, సమర్పణ: మల్టీ డైమన్షన్ ఎంటర్ టైన్మెంట్స్, నిర్మాతలు: బెల్లంకొండ సురేష్, బెల్లకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-కొరియోగ్రఫీ-దర్శకత్వం: రాఘవ లారెన్స్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X