సినిమాలో గెస్ట్ గా కనిపించనున్న ఎఆర్ రహమాన్
ఆస్కార్ అవార్డు విజేత ఎ.ఆర్.రహమాన్ త్వరలో వెండి తెరపై మెరవనున్నారు. ముమ్మట్టి హీరోగా నటించనున్న ట్రాక్ విత్ రహమాన్ అనే చిత్రంలో ఆయన గెస్ట్ గా కనపడనున్నారు. నేషనల్ అవార్డు పొందిన మళయాళ దర్సకుడు జయరాజ్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అలాగే ఈ చిత్రం సంగీతం ప్రధానంగా సాగుతుంది. ఇక రహమాన్ తన నిజ జీవిత పాత్రలోనే కనిపించనున్నారని తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి శ్రీనివాసన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రం ఒకేసారి తమిళం,మళయాళం,హిందీలలో రూపొందుతోంది. ఇక ఈ చిత్రంలో ముమ్మట్టి ఓ ఇన్వెస్ట్ గేట్ ఆఫీసర్ గా కనిపిస్తారు. సింగర్ కావాలని ముంబై వచ్చి హత్య గావింపబడ్డ ఓ గాయకుడు మర్డర్ మిస్టరీని ఛేదించటానికి ముంబై వస్తారు. అక్కడ నుంచి కథ అనేక మలుపులు తిరుగుతుంది.


Click it and Unblock the Notifications











