సినిమా దర్శకత్వంపై... ఏఆర్ రెహమాన్ స్పందన
ప్రస్తుతం మంచి స్క్రిప్టు కోసం ఎదురు చూస్తున్నారని, అన్నీ ఓకే కాగానే సినిమా మొదలు పెట్టబోతున్నారని, ఆయనతో సినిమాలో చేయడానికి చాలా మంది నిర్మాతలు రెడీ గా ఉన్నారనేది ఆ వార్తల సారాంశం. మరో వైపు రెహమాన్ సోదరి ఏఆర్ రిహానా దర్శకురాలిగా పరిచయం కాబోతోందని, రెహమాన్ పర్యవేక్షణలో ఆమె మెగాఫోన్ పట్టబోందనే వార్తలు సైతం వినిపించాయి.
ఈ వార్తల నేపథ్యంలో రెహమాన్ స్పందించారు. తాను ఏ సినిమాకు దర్శకత్వం వహించడం లేదని, అసలు అలాంటి ఉద్దేశ్యం కూడా తనకు లేదని రెహమాన్ తేల్చి చెప్పారు. ప్రస్తుతం తాను పలు మ్యూజిక్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని ఇలాంటి రూమర్స్ ఎలా ప్రచారంలోకి వస్తాయో అర్థం కావడం లేదని రెహమాన్ విస్మయం వ్యక్తం చేసారు.
ప్రస్తుతం రెహహాన్ పలు తమిళం, హిందీ, ఇంగ్లీష్ సినిమా ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం ఆయన రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న 'కొచ్చాడయాన్' చిత్రంతో పాటు, ధనుష్ నటిస్తున్న తమిళ సినిమా మరియాన్, శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న తమిళ చిత్రం 'ఐ', ది సెవెంత్ సన్ అనే ఇంగ్లీష్ చిత్రానికి, హైవే అనే హిందీ చిత్రానికి, పాని అనే ఇంగ్లీష్ చిత్రానికి సంగీతం అందించే పనిలో నిగమ్నమై ఉన్నారు.


Click it and Unblock the Notifications












