నిర్మాత అవతారమెత్తుతున్న స్టార్ మ్యూజిక్ డైరక్టర్
ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రహమాన్ త్వరలో నిర్మాతగా మారనున్నారు.ఫిల్మ్ ప్రొడక్షన్ సంస్ధను స్వయంగా స్ధాపించి పూర్తి మ్యూజికల్ ఫిల్మ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ ప్రొడక్షన్ హౌస్ పేరు వై యన్ మూవీస్. అయితే హిందీలో ఆ సినిమా చేస్తానా...సౌత్ ఇండియన్ లాంగ్వేజిల్లో చేస్తానా అన్నది నిర్ణయించుకోలేదని చెప్తున్నారు.
ఇక చాలా కాలంగా ఈ ఆలోచన తనలో ఉందని అయితే బిజీ షెడ్యూల్స్ వల్ల మెటీరియలైజ్ కాలేదని ఇన్నాళ్ళకు అవకాశం వచ్చిందని చెప్తున్నారు.అలాగే దర్సకుడుగా తన దృష్టిలో చాలామంది ఉన్నారని, మణిరత్నంతో చేయాలని ఉన్నా ఆయన వేరే బిజీల్లో ఉండటం వల్ల కుదరేటట్లు లేదని అన్నారు.స్లమ్ డాగ్ మిలియనీర్ దర్శకుడు తో చేస్తారా అంటే అంత బడ్దెట్ సమకూర్చుకోగలిగితే ఆలోచిస్తాను అన్నారు.


Click it and Unblock the Notifications











