For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  భారతీయులు గర్వించేలా ఏఆర్.రహమాన్ (బర్త్ డేస్పెషల్)

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: మామూలు కీ బోర్డు ప్లేయర్ గా కెరీర్ ప్రారంభించి భారత దేశం గర్వించదగ్గ సంగీత దర్శకుడిగా ప్రపంచస్థాయికి ఎదిగిన ఏఆర్.రెహమాన్ పుట్టినరోజు నేడు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ రెహహన్ నేడు 48వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు. ఈ సందర్భంగా ఆయనకు పుట్టనరోజు శుభాకాంక్షలు.

  రెహమాన్ పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మ్యూజిక్ లెజెండ్ లతామంగేష్కర్ మాట్లాడుతూ రెహమాన్ వెరీ టాలెంట్ అంటూ ప్రశంసించారు.

  కడు పేదరికం నుండి దేశం గర్వించదగ్గ సంగీత దర్శకుడిగా తనదైన టాలెంటుతో ఎదిగిన రెహమాన్ గురించిన వివరాలు స్లైడ్ షోలో...

  అసలు పేరు

  అసలు పేరు

  రెహ్మాన్‌ అసలు పేరు ఎ. ఎస్‌. దిలీప్‌ కుమార్‌. తొమ్మిది సంవత్సరాల ప్రాయంలోనే తండ్రి మరణించాడు. తల్లి, ముగ్గురు అక్కచెల్లెళ్ళు. అసలే పేద కుటుంబం. తండి శేఖర్‌ మరణంతో వారి కుటుంబం కష్టాల పాలైంది.

  11 సంవత్సరాల వయసులో...

  11 సంవత్సరాల వయసులో...

  11 సంవత్సరాల ప్రాయంలో కుటుంబ బాధ్యతలు నెత్తిపై వేసుకొని తల్లికి చేదోడుగా ఉంటూ గిటార్‌, హార్మోనియం, పియానో, కీబోర్డు ప్లేయర్‌గా ఇళయరాజా ట్రూప్‌లో జీవితం ప్రారంభించాడు. 1989వ సంవత్సరంలో కుటుంబమంతా హిందూ మతం నుంచి ఇస్లామ్‌లోకి మారిపోయింది. తర్వాత అతని పేరు అల్లా రఖా రెహమాన్ గా మారింది.

  సంగీత దర్శకుడిగా...

  సంగీత దర్శకుడిగా...

  తన సంగీత జీవితాన్ని రాజ్ - కోటి లాంటి కొందరి వద్ద అసిస్టెంటుగా ప్రారంభించి, కొన్ని ప్రకటనలకు జింగిల్స్ సమకూర్చి, తదనంతరం మలయాళ దర్శకద్వయం సంతోష్-శివన్ ల దర్శకత్వంలో మోహన్ లాల్ కథానాయకునిగా నటించిన యోధ సినిమాతో పరిచయం అయ్యాడు. అయితే ఆయన సంగీతం అందించిన మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘రోజా' సినిమా మొదట విడుదలైంది.

  వరుస విజయాలు

  వరుస విజయాలు

  ‘రోజా' సినిమా భారీ విజయం సాధించడం, ముఖ్యంగా మ్యూజికల్ హిట్ కూడా కావడంతో రెహహాన్ పాపులర్ అండ్ బిజీ సంగీత దర్శకుడయ్యాడు.

  ఆస్కార్

  ఆస్కార్

  "స్లమ్‌డాగ్ మిలియనీర్" అనే చిత్రంలో 'జై హో' అనే పాటకు సమకూర్చిన సంగీతానికి ప్రతిష్టాత్మకమైన "ఆస్కార్"ను కైవసం చేసుకున్న రెహ్మాన్ ఈ గౌరవం తనకు మాత్రమే దక్కలేదని, వంద కోట్ల భారతీయులందరికీ లభించిన అరుదైన గౌరవం అన్నారు. ఈ అవార్డును అందుకున్న తొలి భారతీయుడు రెహ్మాన్.

  త్వరలో స్క్రిప్టు రైటర్‌గా

  త్వరలో స్క్రిప్టు రైటర్‌గా

  ఇప్పటి వరకు సంగీత ప్రపంచంలో మునిగి తేలిన ఏఆర్ రెహమాన్ కొత్త అవతారం ఎత్తబోతున్నారు. స్క్రిప్టు రైటర్‌గా తన టాలెంట్ ప్రదర్శించబోతున్నారు. ఈ విషయం స్వయంగా ఏఆర్ రెహమాన్ వెల్లడించడం గమనార్హం. ముంబైలో జరిగిన హిందీ వెర్షన్ ‘ఐ' ఆడియో వేడుకలో రెహమాన్ ఈ విషయం వెల్లడించారు.

  English summary
  On the 48th birthday of Oscar-winning composer A.R. Rahman on Tuesday, singers like Lata Mangeshkar and Kavita Krishnamurthy have hailed the talent of the ‘Mozart of Madras’, who has given some lilting melodies and memorable numbers throughout his career.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X