U.S. లో లైవ్ కాన్సర్ట్ : ఎ.ఆర్ రహమాన్ మాటల్లో వివరాలు (వీడియో)

By Srikanya

హైదరాబాద్ : సంగీత దర్శకుడిగానూ, గాయకుడిగానూ తనదైన ముద్రవేసిన ప్రముఖ స్వరకర్త ఎ.ఆర్‌.రెహమాన్‌ మరోసారి ప్రేక్షకుల ముందుకు నేరుగా రానున్నారు. ఈ నెల 21 నుంచి జూన్‌ 14 వరకు సాగనున్న సంగీత ప్రదర్శనల గురించి ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నట్లు ఆయన తన ఫేస్‌బుక్‌ పేజీలో రాసుకొచ్చారు.

ఈ నెల 21న న్యూయార్క్‌లోని హంటిగ్టన్‌లో ప్రదర్శనలు ప్రారంభమై 13 నగరాల్లో జరిగి.. జూన్‌ 14న రెడ్‌మండ్‌లో ముగుస్తాయి. ఈ విషయమై ఆయన ఓ వీడియోలో స్వయంగా మాట్లాడారు...ఆ వీడియోను మీరు ఇక్కడ చూడండి..

A.R. Rahman Sets First U.S. Tour in Five Years

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

''ఉత్తర అమెరికాలో సంగీత ప్రదర్శన ఇవ్వడానికి చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను. 2010 తర్వాత మళ్లీ అక్కడ ప్రదర్శన ఇవ్వలేదు. ఈసారి అదిరిపోయే సంగీత ప్రదర్శన ఇస్తాం'' అని రాశారు రెహమాన్‌. 'జైహో' పేరుతో రూపొందించిన డాక్యుమెంటరీని రెహమాన్‌ ఇటీవల న్యూయార్క్‌లో ప్రదర్శించిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం రహమాన్ ...మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న ఓకే బంగారం చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తాజాగా తెరకెక్కుతున్న చిత్రం 'ఓకే కన్మణి' (తెలుగులో ఓకే బంగారం). ఇందులో తుల్కర్‌ సల్మాన్‌, నిత్యామీనన్‌ జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇటీవల ఉన్నట్టుండి ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ప్రేమకథా చిత్రంగా దీన్ని రూపొందిస్తున్నారు.

A.R. Rahman Sets First U.S. Tour in Five Years

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఏప్రియల్ 14, 2015 న విడుదల చేసే అవకాసం ఉందని సమాచారం. ఎగ్జాట్ గా 15 సంవత్సార క్రితం సఖి చిత్రం ఇదే రోజున విడుదలైంది. ఈ రోజు అయితే సెంటిమెంట్ గా కలిసివస్తుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం.

మరో ప్రక్క సినిమా టైటిల్‌ను మార్చినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అది వాస్తవం కాదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. శీర్షికలో ఆంగ్ల పదం ఉండటంతో ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఉండదని, అందుకే మార్చాలనుకున్నట్లు చెప్పాయి. కానీ ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నామని పేర్కొన్నాయి.

ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం కేరళ, తమిళనాడు సరిహద్దులో జరుగుతోంది. ఇటీవల కీలక సన్నివేశాలను చెన్నైలో తెరకెక్కించారు. ప్రకాశ్‌రాజ్‌, కనికా తదితరులు నటిస్తున్నారు. నిశ్శబ్దంగా సినిమాను ఆరంభించిన మణిరత్నం.. చాలా వేగంగా చిత్రీకరించేశారు.

ఇక తెలుగు వెర్షన్ విషయానికి విషయానికి వస్తే...

ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ సంస్థ తెలుగు ఈ సినిమాను విడుదల చేస్తుంది. తెలుగులో ‘ఒకే బంగారం' అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ వేసవి ప్రారంభంలో ఏప్రిల్ నెలలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇదొక ట్రెండ్ సెట్టింగ్ లవ్ స్టొరీ. సినిమాలో క్యారెక్టర్లు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయి. మణిరత్నం ‘ఒకే బంగారం'తో తన స్ట్రెంగ్త్ ఏంటి అనేది చూపిస్తాడు. అని ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్ సినిమా విజయంపై ధీమాను వ్యక్తం చేశారు. ప్రకాష్ రాజ్, కనిక కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. తమిళంలో సొంత నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ పతాకంపై సుహాసిని మణిరత్నం, మణిరత్నంలు ‘ఒకే కన్మణి'ను నిర్మించారు.

మణిరత్నం చిత్రం అంటేనే ఆటోమేటిక్‌గా ఒక క్రేజ్ క్రియేట్ అవుతుంది. ఆయన దర్శకత్వ శైలినే అందుకు కారణాలు కావచ్చు. మౌనరాగం, దళపతి, నాయకన్, అగ్నినక్షత్రం లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల సృష్టికర్త మణిరత్నం. ఈయన భారీ యాక్షన్ కథా చిత్రాలను తెరకెక్కించడంలో ఎంత దిట్టనో, అందమైన ప్రేమ కథా చిత్రాలను సెల్యులాయిడ్‌పై ఆవిష్కరించడంలోనూ అంత సిద్ధహస్తుడు.

మౌనరాగం, ఇదయత్తైతిరుడాదే (తెలుగులో గీతాంజలి), రోజా, అలప్పాయిదే వంటి ప్రేమ కథా చిత్రాలు ప్రేక్షకులను ఎంతగా అలరించాయి. తాజాగా అలాంటి అద్భుత ప్రేమ కథా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి వారసుడు దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయనకు జంటగా నటి నిత్యామీనన్ నటిస్తున్నారు. ఈ చిత్ర కథ విని బల్క్ కాల్‌షీట్స్‌ను దుల్కర్ సల్మాన్ కేటాయించగా నటి నిత్యామీనన్ మణిరత్నం దర్శకత్వంలో నటించాలనే తన చిరకాల కోరిక ఈ చిత్రంతో నెరవేరడం ఆనందంగా ఉందన్నారు.

చిత్ర కథను దర్శకుడు చెప్పగానే స్ఫెల్‌బౌండ్ అయిపోయానని నిత్యామీనన్ అన్నారు. కాగా ఈ చిత్రంలో ముఖ్యభూమికను పోషిస్తున్న ప్రకాష్‌రాజ్ చాలాకాలం తరువాత ఒక మంచి చిత్రంలో నటిస్తున్నానంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మణిరత్నం ఆస్థాన విద్వాంసుడు ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ చిత్రం షూటింగ్ చెన్నై పరిసర ప్రాంతాలలో సెలైంట్‌గా జరుపుకుంటోం ది.

హీరోయిన్‌గా మొదట ఆలియా భట్ అనుకున్నారు. ఇప్పుడు తాజాగా నిత్యామీనన్ సీన్ లోకి వచ్చింది. నిత్య, దుల్ఖర్ ఇద్దరూ కలిసి నటించిన ‘ఉస్తాద్ హోటల్' మంచి హిట్ కొట్టింది. వీరిద్దరూ బెస్ట్ ఆన్‌స్క్రీన్ పెయిర్‌గా వనితా ఫిల్మ్ అవార్డుకూడా అందుకున్నారు. ఇద్దరూ కలిసి నటించిన ‘హండ్రెడ్ డేస్ ఆఫ్ లవ్' త్వరలో విడుదల కాబోతోంది.

నిత్యా మీనన్ మాట్లాడుతూ... ‘‘మణిరత్నంలాంటి విజన్‌ ఉన్న దర్శకుడితో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. నేను నా కెరీర్‌ని ఎప్పుడూ ప్రత్యేకంగా ప్లాన్‌ చేయలేదు. అయినా చాలా సాఫీగా, ఆనందంగా సాగిపోతోంది'' అని అంటోంది నిత్యామీనన్‌. మణిరత్నం దర్శకత్వంలో దుల్కర్‌ సల్మాన్‌ సరసన నటిస్తోందీ భామ.

ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పి.సి శ్రీరామ్ పనిచేస్తున్నారు. దాదాపు దశాబ్దం తర్వాత మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయనున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో పలు విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. వీరిద్దరి కాంబినేషన్ సఖి ఆఖరి చిత్రం. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్.రెహ్మాన్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X