»   » 3 విశేషాలు, రేపు మాకు నిజమైన పండగరోజు: రేణు దేశాయ్

3 విశేషాలు, రేపు మాకు నిజమైన పండగరోజు: రేణు దేశాయ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రేణు దేశాయ్ తన పిల్లలు అకీరా నందన్, ఆద్యాలతో కలిసి పూణెలో ఉంటోంది. తల్లిగా తన భాద్యత నిర్వర్తిస్తూనే దర్శకురాలిగా, నిర్మాతగా తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది రేణు దేశాయ్.

రేణు దేశాయ్‌కి హైదరాబాద్ లో లేక పోయినా....తన సోషల్ మీడియా ద్వారా తెలుగు అభిమానులతో టచ్ లోనే ఉంటున్నారు. తనకు సంబంధించిన, పిల్లలకు సంబంధించిన విషయాలు ఆమె ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నారు. తాజాగా ఆమె ట్విట్టర్లో చేసిన ట్వీట్స్ చర్చనీయాంశం అయ్యాయి.

రేపు(ఏప్రిల్ 8) మాకు నిజమైన పండగ రోజే... ఈ రోజు మూడు విశేషాలు ఉన్నాయి. ఈ రోజు ఉగాది పండగ మాత్రమే కాదు... అకీరా పుట్టినరోజు, సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ కూడా ఈ రోజే. అందుకే మాకు ఇది నిజమైన పండగరోజు అంటూ రేణు దేశాయ్ ట్వీట్ చేసారు.

పవన్ కళ్యాణ్‌తో విడిపోయినా... ఆయనతో ఫ్రెండ్షిప్ కొనసాగిస్తూనే ఉన్నారు రేణు దేశాయ్. తరచూ పవన్ కళ్యాణ్ పూణె వచ్చి పిల్లలను కలుస్తూ ఉంటారు. అకీరా, ఆద్యాలకు సంబంధించిన స్కూలు ఫ్రోగ్రాంలకు కూడా ఆయన హాజరవుతున్నారు. సర్దార్ గబ్బర్ సినిమా విడుదలపై రేణు దేశాయ్ కూడా చాలా హ్యాపీగా ఉందనడానికి ఆమె ఈ రోజు చేసిన ట్వీటే నిదర్శనం. తన కుమారుడు అకీరా బర్త్ డే కాబట్టి.... రేపు పవన్ కళ్యాణ్ పుణెలో ఉంటారని తెలుస్తోంది.

English summary
"8th April #HappyBirthdayAkira & #SardaarGabbarSingh. And #Ugadi pandugaa A real festival day for all of us tomorrow" Renu Desai tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu