For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టార్గెట్ వర్మ అనే అన్నారు... (ఫోటోస్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: సమిష్టి క్రియేషన్స్ పతాకంపై షఫీ ముఖ్య పాత్రలో వస్తున్న సెటైరికల్ క్రైమ్ కామెడీ చిత్రం ‘ఎ శ్యామ్ గోపాల్ వర్మ ఫిల్మ్'. నా సినిమా నా ఇష్టం అనేది టాగ్ లైన్. జోయా ఖాన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి వి.విజయకుమార్ రాజు నిర్మాత. రాకేష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆనంద్ సంగీతం అందించారు. ఈ చిత్రా ఆడియో ఆవిష్కరణ హైదరాబాద్ లో జరిగింది.

    ఫేస్‌బుక్ ద్వారా అన్ని అప్‌డేట్స్ పొందండి

    యండమూరి వీరేంద్రనాధ్ చీఫ్ గెస్టుగా విచ్చేసి ఆడియో సీడీలను ఆవిష్కరించారు. అనంతరం షఫీ మాట్లాడుతూ - ''రియలిస్ట్ అప్రోచ్ తో ఉన్న చిత్రాలంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఈ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాను. దాదాపు రెండేళ్ల పాటు డైరెక్టర్ ఈ కథ రాసుకున్నారు. మేమందరం ఎంతో ఇష్టంగా చేస్తున్న ఈ సినిమా మంచి విజయం అందుకుంటుందనే నమ్మకం ఉంది''అని తెలిపారు.

    స్లైడ్ షోలో మరిన్ని వివరాలు, ఫోటోలు...

    డైరెక్టర్ రాకేష్ శ్రీనివాస్ మాట్లాడుతూ -

    డైరెక్టర్ రాకేష్ శ్రీనివాస్ మాట్లాడుతూ -

    ''రక్తపాతాలతో సినిమాలు తీసే ఓ డైరెక్టర్ కి ఎలాంటి అనుభవం ఎదురయ్యిందనే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. శ్యామ్ గోపాల్ వర్మగా షఫి అద్భుతంగా నటించాడు. చక్కటి టీమ్ ఈ చిత్రానికి కుదిరింది. సినిమాటోగ్రఫీ, రీ-రికార్డింగ్ హైలెట్ గా నిలుస్తాయి. ఆనంద్ కి 'మంత్ర' అంతటి పేరు ఈ చిత్రం తెచ్చి పెడుతుంది'' అని తెలిపారు.

    సంగీత దర్శకుడు ఆనంద్ మాట్లాడుతూ

    సంగీత దర్శకుడు ఆనంద్ మాట్లాడుతూ

    ''ఈ సినిమా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇందులో నాలుగు పాటలున్నాయి. ఒకటి రీమిక్స్ చేసాం. పాత సాంగ్ ఫ్లేవర్ పాడు కాకుండా, ఈ పాటను రీమిక్స్ చేసాం' అని తెలిపారు.

    తారాగణం

    తారాగణం

    ఈ చిత్రంలో షఫీ, జోయాఖాన్, జయప్రకాష్ రెడ్డి, శివకృష్ణ, ఎల్.బి.శ్రీరాం, జీవా, సూర్య, పృద్వీరాజ్, తెలంగాణా శకుంతల, కొండవలస, నర్సింగ్ యాదవ్, గుండు హనుమంత రావు, శివన్నారాయణ, చంటి, ప్రభాస్ శ్రీను, సత్యం రాజేష్, వాసు ఇంటూరి, సౌమ్య, హరీష్ కోయిలగుండ్ల తదితరులు

    టెక్నీషియన్స్

    టెక్నీషియన్స్

    సంగీతం: ఆనంద్, సినిమాటోగ్రఫి: రాహుల్ శ్రీవాత్సవ్, ఆర్ట్: పార్థ సారథి వర్మ, ఎడిటర్: కార్తిక శ్రీనివాస్, కొరియోగ్రఫీ: బాలు, సహ నిర్మాతలు: రేఖా రెడ్డి, పి.వి.సత్య నారాయణ రాజు, పి.సూర్య నారాయణ రాజు, ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: K. రంగ రాజు, నిర్మాత: వి. విజయ కుమార్ రాజు, కథ, మాటలు, స్క్రీన్ ప్లే & దర్శకత్వం: రాకేష్ శ్రీనివాస్.స

    English summary
    A Shyam Gopal Varma Film Audio Launch event held in hyderabad. Shafi and others graced the event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X