twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫ్రాన్స్‌లో 'బాహుబలి'కి చప్పట్లు...ప్రభాస్ ఫుల్ హ్యాపీ (వీడియో)

    By Srikanya
    |

    హైదరాబాద్‌: ఫ్రాన్స్‌లో జరుగుతున్న 20వ 'ది స్ట్రేంజ్‌ ఫెస్టివల్‌'(లా ట్రాన్స్‌ ఫిలింఫెస్టివల్‌) ఈ నెల 3 నుంచి 13 వరకు జరిగింది. ఈ ఫిలింఫెస్టివల్‌లో తెలుగులో అత్యంత భారీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన 'బాహుబలి' చిత్రాన్ని ప్రదర్శించారు.

    ఈ చిత్రాన్ని వీక్షించిన అనంతరం హాల్‌లో కరతాళ ధ్వనులు మార్మోగాయని చిత్ర హీరో ప్రభాస్‌ ఫేస్‌బుక్‌ ద్వారా వెల్లడించారు. తమ చిత్రాన్ని అభినందించినందుకు కృతజ్ఞతలు అంటూ ఆయన వారికి ధన్యవాదాలు తెలిపారు.

    Humbled watching the applause at the screening of Baahubali in France... Thank you all so so much.

    Posted by Prabhas on14 September 2015

    భారతీయ సినీ చరిత్రలో ఓ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది 'బాహుబలి'. ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అనువాదమై దేశవ్యాప్తంగా విశేష ప్రేక్షకాదరణ పొందింది. మన దేశంలో అత్యధిక స్థూల వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డులు సృష్టించింది.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    చైనాలో 'బాహుబలి'

    ఇప్పుడు ఇతర దేశాల్లోనూ సందడి చేసేందుకు సిద్ధమైంది. చైనాలో 'బాహుబలి'ని 5000 థియేటర్లలో విడుదల చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాల మేరకు చిత్రాన్ని ఎడిట్‌ చేశారు. పలు చలన చిత్రోత్సవాలకీ పంపుతున్నారు. చైనాలో ఈ చిత్రం నవంబరు నుంచి సందడి చేయబోతోంది. అక్కడ 'పీకే' చిత్రాన్ని విడుదల చేసిన ఈ స్టార్స్‌ ఫిలిమ్స్‌ సంస్థనే 'బాహుబలి'ని విడుదల చేస్తుండడం విశేషం.

    A standing ovation for Baahubali in France!

    'పీకే'కి చైనాలో మంచి ఆదరణ లభించింది. అదే తరహాలో 'బాహుబలి' కూడా చైనా ప్రేక్షకుల్ని అలరిస్తుందని సినీ వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

    English summary
    Baahubali get standing ovationin France!. Prabhas Feels very happy with this movement.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X