డౌటే: ఆవిష్కరణకు పవన్ కళ్యాణ్ వస్తారా?

By Srikanya

హైదరాబాద్ :పవన్ కళ్యాణ్ కి ఆయన అభిమానుల్లో ఎంతటి క్రేజ్, ఫాలోయింగ్ వుందో ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఆ పాపులారిటీ ఇప్పుడు పీక్స్ కు చేరింది. ఆయన అభిమాని చందు బాబు అనే ఆయన ఓ విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. కరుణాకర్ వాడేయార్ అనే ప్రముఖ శిల్పి తాడేపల్లిగూడెంలో ఈ పవన్ విగ్రహం రూపొంస్తున్నారు. ఈ విగ్రహం ఏడున్నర అడుగుల ఎత్తు ఉండనుంది. ప్రస్తుతం విగ్రహానికి ఫైనల్ టచెస్ ఇస్తున్నారు. ఇక ఈ విగ్రహాన్ని ఆవిష్కరించటానికి పవన్ కళ్యాణ్ ని తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే పవన్ కల్యాణ్ వస్తారా రారా అన్నది ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్న.

ఇక తాడేపల్లి గూడెంకి చెందిన చందు మోహన్ కు పవన్ అంటే విపరీతమైన అబిమానం. అంతేకాదు ఆయన ఆలోచనలను స్పూర్తిగా తీసుకున్నారు. ఎక్కడన్నా అన్యాయం జరిగితే వెంటనే ప్రశ్నించాలన్న పవన్ వ్యాఖ్యలు తనలో కదలికలు తీసుకు వచ్చిందని...ఈ నేపధ్యంలో తాను ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఇక ఈ విగ్రహం ద్వారా పవన్ కళ్యాణ్ ఇచ్చే సందేశం మరింతగా జనాల్లోకి వెళ్తుందని ఆయన అభిప్రాయ పడ్డారు. ఏడున్నర అడుగులు ఏత్తుగల ఈ విగ్రహాన్ని బంకమట్టితో తయారు చేయించి, పైన ఇత్తడి పూత తో మెరుగులు దిద్దుతున్నట్లు తెలియచేసారు. అలాగే ఈ విగ్రహాన్ని పవన్ కళ్యాణ్ తో ఆవిష్కరించాలని భావిస్తున్నట్లు చెప్పారు. త్వరలో పవన్ ని కలిసి ఆహ్వానిస్తామని మోహన్ అన్నారు.

A statue for Pawan Kalyan!

ఇక పవన్ ‘గోపాల గోపాల' విషయానికి వస్తే...

హిందీలో విజయవంతమైన ‘ ఓ మైగాడ్‌ ' చిత్రాన్ని పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, విక్టరీ వెంకటేష్‌ మల్టీస్టారర్‌గా తెలుగులో తెరకెక్కిస్తున్న చిత్రం ‘ గోపాల గోపాల '. ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్ట్‌ర్‌ను విడుదల చేశారు. పవన్‌ అభిమానులంతా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పోస్టర్‌ రానే వచ్చింది.

ఈ చిత్రంలో పవన్‌ కళ్యాణ్‌ మోడ్రన్‌ కృష్ణుడి పాత్రలో కనిపిస్తున్నాడు. ఊయలలో ఊగుతున్న కృష్ణుడిలా ఉన్న పవన్‌ను వెంకటేష్‌ అనుకరించడం ఈ పోస్టర్‌లోని విశేషం. కిషోర్‌ పార్థసాని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి అనుప్‌రూబెన్స్‌ స్వరాలు అందిస్తున్నారు. డి.సురేష్‌బాబు, శరత్‌ మరారీ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో మధుశాలిని, దీక్షాపంత్‌లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ చిత్రం షూటింగ్‌ చివరి దశలో ఉండటంతో చిత్రీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉంది. అందరి ఊహగానాలకు తగ్గట్టుగానే ఈ చిత్రం ఉంటుందని ఫిలింనగర్‌లో టాక్‌ వినబడుతోంది. కిషోర్‌ పార్ధసాని దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి డి.సురేష్‌బాబు, శరత్‌ మారార్‌లు కలిసి నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X