»   » చ..! మళ్ళీ సెక్స్ మీదే: వర్మ శిష్యుడు కూడా అదే సబ్జెక్ట్ తో (వీడియో)

చ..! మళ్ళీ సెక్స్ మీదే: వర్మ శిష్యుడు కూడా అదే సబ్జెక్ట్ తో (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్‌గోపాల్ వర్మ ప్రతీ విషయం లో తీవ్రంగానే ఉంటాడు, మాట్లాడినా, సినిమా తీసినా, ఆఖరికి సోషల్ మీదియాలో పోస్ట్ పెట్టినా అదే రకమైన ఇంపాక్ట్ ఉంటుంది. ప్రతీదానిమీదా చర్చ జరుగుతుంది. రియాలిటినీ ని చూపిస్తున్నా అంటూనే దాన్ని ఎంత దారుణం గా చూపించవచ్చో అంతగానూ చూపించేస్తాడు. ఖండించే సమయం లో కూడా ఇది నిజమే కదా అనే ఒక పాయింట్ ఉండేలా చూస్కుంటాడు.

మరింత ఆసక్తిగా చూడాలంటే

మరింత ఆసక్తిగా చూడాలంటే

అదే ఇప్పటికీ వర్మ మీద జనాలకి వ్యతిరేకత ఉన్నా ద్వేషం గా మారకుండా ఉంచుతోంది. ఒక విషయాన్ని మామూలుగా కూడా చెప్పవచ్చు కానీ మరింతగా ప్రేక్షకుడు చెప్పే విషయాన్ని మరింత ఆసక్తిగా చూడాలంటే అందులో రియాలిటీ అనిపించే వల్గారిటీ లేదా భయం కలిగించే ఎలిమెంట్ ఉండాలి. అదే ఫార్ములాని వర్మ ఇప్పటికీ వాడుతున్నాడు.

తరుణ ఖనాగ్వాల్

తరుణ ఖనాగ్వాల్

అయితే వర్మ శిశ్యుల్లో కూడా అచ్చం వర్మలాంటి ఆలోచనలే మొదలయ్యాయి ఇదివరకు ఇంతగా వర్మ ని ఓన్ చేసుకున్నవాళ్ళు తక్కువ, తేజ, ఉత్తేజ్, పూరీ వీళ్ళంతా వర్మ స్కూల్ నుంచే వచ్చినా మరీ వర్మ బుద్దులు తెచ్చుకోలేదు.... అయితే ఇప్పుడు ఒక దర్శకుడు వర్మ ఫ్యాక్టరీలో తయారయ్యాడు...

'ఫారినర్' అనే షార్ట్ ఫిలిం

'ఫారినర్' అనే షార్ట్ ఫిలిం

ఈ శిష్యుడు తరుణ ఖనాగ్వాల్ రూపొందించిన 'ఫారినర్' అనే షార్ట్ ఫిలిం రాబోతోంది. రేపు అంటే జూలై 8న ఉదయం 9గంటలకు ఈ ఫారినర్ షార్ట్ ఫిలిం విడుదల కానుండగా.. నిన్న విడుదలైన ఈ ట్రైలర్ ను చూస్తే.. వర్మ టైపులోనే ఆయన శిష్యుల తీరు ఉన్న సంగతి అర్ధమవుతుంది.

ఫారినర్ గురించి

ఫారినర్ గురించి

మన దేశంలో సెటిల్ అయిన ఓ ఫారినర్ గురించి.. ఇక్కడి వారు ఎలా అట్రాక్ట్ అయారు అనేది థీమ్. అయితే.. ఆ ఫారినర్ ను చూపించిన తీరు.. కెమేరా సెట్ చేసిన యాంగిల్స్.. ఆమె అందాలను మాత్రమే ఫోకస్ చేస్తున్న తీరు చూస్తే మాత్రం.. అచ్చంగా వర్మ మేకింగ్ స్టైల్ ను చూస్తున్నట్లే ఉంటుంది.

పోర్న్ సినిమాలను తలపించేలా

మామూలుగా చెప్పాలంటే దరిద్రంగా ఉందని చెప్పుకోవచ్చు. ఆ సబ్జెక్ట్ ని మామూలుగా కూడా తీయవచ్చు అయినా ఇలా పోర్న్ సినిమాలను తలపించేలా చెత్తగా ఎందుకు తీస్తారో వారికే తెలియాలి. రేపొద్దున్నే ఈ సినిమా ఫుల్ వర్షన్ రిలీజ్ చేస్తున్నారట. ఇక ఇంకో నాలుగు రోజు సోషల్ మీడియా లో రచ్చ కొనసాగుతుందన్నమాట.

English summary
Another Controversial short film out from ram gopal varma talkies named Foreigner
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu