ఐశ్వర్య రాయ్‌కి కొడుకా?: ఎవరీ వ్యక్తి.. సాక్ష్యాలు కూడా ఉన్నాయట..
Recommended Video

సినిమా నటుల జీవితాల్లో ఎఫైర్స్ అనే మాట చాలా కామన్‌గా వినిపించే పదం. తెర వెనుక సంబంధాలపై ఎప్పుడూ ఏదో వార్త హల్ చల్ చేస్తూనే ఉంటుంది. వాటిల్లో నిజాలు ఉండవచ్చు.. ఉండకపోవచ్చు. వ్యక్తిగత జీవితం గురించి సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం వాళ్లకు కూడా లేదు.
దివంగత సీఎం జయలలిత మరణం తర్వాత శోభన్ బాబుతో ఆమె సంబంధం గురించి పెద్ద చర్చే మొదలైంది. అమృత అనే యువతి జయలలిత తన బయోలాజికల్ మదర్ అంటూ పిటిషన్ వేయడంతో ఈ చర్చ తెర మీదకు వచ్చింది. ఇక ఇప్పుడు ఐశ్వర్య రాయ్ వంతు కూడా వచ్చేసింది..

అసలేంటిది?:
తాను ఐశ్వర్యరాయ్ కుమారుడిని అంటూ సంగీత్ రాయ్ అనే ఒక యువకుడు సంచలన ప్రకటన చేశాడు. కర్ణాటకలోని మంగళూరులో సంగీత్ రాయ్ ఈ ప్రకటన చేశాడు.

ఏమంటున్నాడు?:
ఐశ్వర్యారాయ్‌కు తాను ఐవీఎఫ్(టెస్ట్ ట్యూబ్ తరహా) పద్దతిలో జన్మించానని సంగీత్ రాయ్ చెబుతున్నాడు. 1988లో లండన్‌లో ఐశ్వర్యకు తాను జన్మించినట్లు చెబుతున్నాడు.

సాక్ష్యాలతోనే..
విశాఖపట్నం జిల్లా చోడవరంలో తాను ఇన్నాళ్లూ నివసించానని, తాను ఐశ్వర్యా రాయ్ కుమారుడినేనని చెప్పేందుకు.. పూర్తి సాక్ష్యాధారాలు సేకరించాకే మీడియా ముందుకు వచ్చినట్లు చెబుతున్నాడు.

తల్లిని మిస్ అవుతున్నా..:
తన బర్త్ రికార్డ్స్ బంధువులు మాయం చేశారని, అయినప్పటికీ.. కొన్ని సాక్ష్యాధారాలను సాధించగలిగానని అంటున్నాడు. ఇన్నేళ్లుగా తన తల్లి ఐశ్వర్యను మిస్ అయ్యానని, ఇకనైనా ఆమెతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.

రెండేళ్ల వయసులో:
రెండేళ్ల వయస్సులో తనను ముంబైకి తీసుకెళ్లారని సంగీత్ రాయ్ చెబుతున్నాడు. తన అమ్మమ్మ పేరు బ్రింద్యా కృష్ణరాజ రాయ్ అని, తాత పేరు కృష్ణరాజ రాయ్ అని చెప్పాడు. కృష్ణరాజ రాయ్ కొద్ది కాలం క్రితమే మరణించారని తెలిపాడు.


Click it and Unblock the Notifications











