»   » ఫ్యాన్స్‌కు పండగరోజు...నేడు మహేష్ పుట్టినరోజు

ఫ్యాన్స్‌కు పండగరోజు...నేడు మహేష్ పుట్టినరోజు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు నేడు పండగ రోజు. ఈ రోజు మహేష్ బాబు 38వ వసంతలోకి అడుగు పెడుతున్నారు. 1975 ఆగస్టు 9న ఘట్టమనేని కృష్ణ-ఇందిరాదేవిలకు జన్మించిన మహేష్ బాబు తండ్రి నుంచి నట వారసత్వాన్ని పునికిపుచ్చుకుని నేడు అశేష తెలుగు ప్రజల అభిమాన నటుడిగా ఎదిగాడు.

నాలుగవ ఏటనే 'నీడ' అనే చిత్రం ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత 8 చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన మహేష్ 1999లో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన 'రాజకుమారుడు' చిత్రం ద్వారా హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యారు.

మురారి, ఒక్కడు, అతడు, పోకిరి, దూకుడు లాంటి సూపర్ హిట్ చిత్రాలతో సూపర్ స్టార్‌గా ఎదిగారు. పక్కా కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా నాని, మురారి, నిజం లాంటి వైవిధ్యమైన సినిమాలను కూడా తీసి మంచి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

మహేష్ బాబు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే నంది అవార్డులు 7 అందుకున్నారు. రాజకుమారుడు, మురారి, టక్కరి దొంగ, నిజం, అర్జున్, అతడు, దూకుడు చిత్రాలకు గాను ఈ అవార్డులు అందుకున్నారు. వీటితో పలు ఫిలింఫేర్ అవార్డులతో పాటు ఇతర అవార్డులు ఆయన్ను వరించాయి.

మహేష్ బాబుకి అన్నయ్య రమేష్ బాబు, అక్కయ్యలు పద్మావతి, మంజుల, చెల్లెలు ప్రియదర్శిని ఉన్నారు. ఆయన తనతో "వంశీ" చిత్రంలో నటించిన నమ్రతా శిరోడ్కర్‌ని 2005లో ప్రేమ వివాహం చేసుకున్నారు మహేష్. ఈదంపతులకు గౌతం, సితార అనే ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో '1'(నేనొక్కడినే) చిత్రం చేస్తున్నారు. షూటింగులో భాగంగా లండన్లో ఉన్నారు. మరి మహేష్ బాబుకి వన్ ఇండియా తెలుగు తరపున టాలీవుడ్ సూపర్ స్టార్‌కి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దాం.

English summary
Tollywood super star Mahesh Babu turns 37 today. Mahesh Babu is an Indian film actor best known for his work in Telugu cinema. Born to actor Krishna in the Ghattamaneni family, Mahesh Babu faced the camera at the age of four as a child artist in 1979's Needa.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu