»   » ఈ ముద్దే సాక్ష్యం...హీరోయిన్ ఇంట్లో పెళ్లి భాజా?(ఫోటోలు)

ఈ ముద్దే సాక్ష్యం...హీరోయిన్ ఇంట్లో పెళ్లి భాజా?(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఇంట్లో త్వరలో పెళ్లి భాజాలు మ్రోగ బోతున్నాయి. అయితే ప్రియాంక చోప్రా అభిమానులు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. పెళ్లి ప్రియాంక చోప్రాది కాదులెండి. ప్రియాంక చోప్రా సోదరుడు సిద్ధార్థ్ చోప్రా పెళ్లికి సిద్ధం అవుతున్నాడట. 2014లో ఆయన పెళ్లి గ్రాండ్‌గా జరిగే అవకాశం ఉందని టాక్.

బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం...సిద్ధార్థ చోప్రా ఎంగేజ్మెంట్ కొన్ని రోజుల క్రితం ఆయన గర్ల్ ఫ్రెండ్ కనికా మాధుర్‌తో జరిగిందట. గత మూడేళ్లుగా ఇద్దరూ డేటింగులో ఉన్నారట. త్వరలో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారని, వచ్చే ఏడాది పెళ్లి జరిగే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రియాంక చోప్రా ఫ్యామిలీతో పాటు కనికా ఫ్యామిలీ పెళ్లిని పూర్తిగా ప్రైవేట్ ఫంక్షన్‌గా జరుపుకోవాలని, ఢిల్లీలో వీరి వివాహం జరిపించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సిద్ధార్థ చోప్రా ప్రియాంక కంటే వయసులో ఒక సంవత్సరం చిన్నాడు. స్విట్జర్లాండ్‌లో ఉన్నత విద్యాభాసం చేసాడు.

సిద్ధార్థ చోప్రా-కనికా

సిద్ధార్థ చోప్రా-కనికా


ఇక్కడ ఫోటోలో చిలకా గోరింకల్లా ముద్దులాడుకుంటున్న జంటే సిద్ధార్థ చోప్రా, కనికా. ఇద్దరూ గత కొంత కాలంగా డేటింగులో ఉన్నారు.

ప్రియాంక-సిద్ధ్

ప్రియాంక-సిద్ధ్


‘సిద్ధ్ నాకుంటే చిన్నవాడు. తమ్ముడంటే నాకు ఎంతో ఇష్టం. ఇద్దరం చాలా క్లోజ్‌గా ఉంటాం' అని సిద్ధార్థ గురించి ముద్దు ముద్దుగా చెబుతోంది ప్రియాంక చోప్రా.

ప్రియాంక ఫ్యామిలీ

ప్రియాంక ఫ్యామిలీ


తన తల్లిదండ్రులు డాక్టర్ అశోక్, మధు చోప్రాలతో కలిసి సిద్ధార్థ చోప్రా.

సిద్ధార్థ్ చోప్రా-ప్రియాంక చోప్రా

సిద్ధార్థ్ చోప్రా-ప్రియాంక చోప్రా


సిద్ధార్థ మంచి వంటగాడని, తన కోసం స్పెషల్‌గా పలు రకాల వంటలు వండి మెప్పిస్తాడని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ప్రియాంక చోప్రాం...

అరుదైన ఫోటో...

అరుదైన ఫోటో...


ప్రియాంక చోప్రా, తన తమ్ముడు సిద్ధార్థ చోప్రా...రేర్ పిక్చర్

English summary
You must be wondering if actress Priyanka Chopra has finally found her soulmate and have decided to settle down. But, that's certainly not correct. As per the latest reports, Priyanka's little brother Siddharth Chopra is all set to tie the knot by next year, 2014.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu