రామ్ చరణ్-బోయపాటి మూవీ: ఒక్క ఫైట్ సీన్ కోసం రూ. 5 కోట్ల ఖర్చు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ భారీ యాక్షన్ సీన్ చిత్రీకరిస్తున్నారు. బోయపాటి సినిమా అంటేనే యాక్షన్ సీన్లు భారీ స్థాయిలో ఉంటాయి. అందులోనూ రామ్ చరణ్ సినిమా కావడంతో ఈ సారి భారీతనం మరింత పెంచాడు. ఈ సీన్ కోసం ఎంత ఖర్చు పెడుతున్నారో తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే.

రూ. 5 కోట్ల ఖర్చు, 500 బాడీ బిల్డర్లు, 60 మంది యాక్టర్లు
రూ. 5 కోట్ల ఖర్చుతో బోయపాటి ఈ భారీ యాక్షన్ సీన్ చిత్రీకరిస్తున్నారట. ఈ సీన్లో ఏకంగా 500 మంది బాడీ బిల్డర్లు పాల్గొంటున్నారని, వీరితో పాటు 60 మంది నటులు ఈ యాక్షన్ సీక్వెన్స్‌లో కనిపిస్తారని సమాచారం.

అన్నింటినీ మించి పోయేలా
బోయపాటి ఇప్పటి వరకు తీసిన సినిమాలన్నింటిలోనూ భారీ యాక్షన్ సీన్లు ఉన్నాయి. ఒక్కో సినిమాకు డోసు పెంచుతూ వచ్చాడు. ఆయన గత చిత్రం ‘జయ జానకి నాయక'లో హంసల దీవిలో చిత్రీకరించిన యాక్షన్ సీక్వెన్స్ సినిమా మొత్తానికి హైలెట్ అయింది. అయితే దాన్ని మించిపోయేలా ఇపుడు రామ్ చరణ్ మూవీలో భారీ ఫైట్ సీన్ తెరకెక్కిస్తున్నారు.

సంక్రాంతి రిలీజ్
ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే రంగస్థలం సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన రామ్ చరణ్.... వచ్చే సంక్రాంతికి మరో బ్లాక్ బస్టర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రంగం సిద్ధమైంది.

త్వరలో టైటిల్
ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ త్వరలో ఖరారు చేయనున్నారు. భరత్ అనే నేను మూవీ ఫేం కియారా అద్వానీ ఈ చిత్రంలో రామ్ చరణ్‌తో రొమాన్స్ చేస్తోంది. ప్రశాంత్, వివేక్ ఒబెరాయ్, స్నేహ, హిమజ, ప్రవీణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











