twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'ఉమెన్ ఇన్ బ్రామ్మణిజం' పై కమిటీ నిర్ణయం ఇదే...

    By Srikanya
    |

    హైదరాబాద్ : వివాదాస్పద 'ఉమెన్ ఇన్ బ్రామ్మణిజం' చిత్రాన్ని నిషేధించాలని ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీ సిఫారసు చేసింది. రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి నీలం సహానీ నేతృత్వంలోని కమిటీ.. ఈమేరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఎనిమిది మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ.. ఈ నెల ఐదో తేదీన చిత్రాన్ని వీక్షించింది. అందులో అసభ్యకరంగా ఉన్న దృశ్యాలపై తీవ్రంగా స్పందించింది.

    అశ్లీలత, అసభ్యత, శృంగారమే లక్ష్యంగా, ఒక కులాన్ని కించపరిచే సన్నివేశాలతో నిర్మించిన 'వుమెన్‌ ఇన్‌ బ్రామ్మనిజం' చిత్రాన్ని పూర్తిగా నిషేధించాలని నీలం సహాని నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ చిత్రం ప్రజాప్రదర్శనకు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. కమిటీ సమ్వనయకర్తగా వ్యవహరించిన రాష్ట్ర సినిమా, టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ ఎండీ చంద్రవదన్‌ నివేదికను ప్రభుత్వానికి అందజేశారు.

    "అశ్లీలం, అసభ్యత, శృంగారమే లక్ష్యంగా కేవలం పడకసీన్లతో నిర్మించిన చిత్రాన్ని పూర్తిగా నిషేధించాలి. చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ఒక కులాన్ని కించపర్చేవిగా ఉన్నాయి. ఈ చిత్రం ప్రజాప్రదర్శనకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు'' అని పేర్కొంటూ నివేదిక రూపొందించింది. ఈ నివేదికను ఎఫ్‌డీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్వీ చంద్రవదన్ ప్రభుత్వానికి అందించారు. తమ వినతికి స్పందించి సినిమా పరిశీలనకు కమిటీని ఏర్పాటు చేసి న్యాయం చేకూర్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు బ్రాహ్మణసంఘం నేత ద్రోణంరాజు రవికుమార్ తెలిపారు.

    మరో ప్రక్క 'దేనికైనా రెడీ' చిత్రానికి వ్యతిరేకంగా గత కొద్దిరోజులుగా బ్రాహ్మణసంఘాలు చేపట్టిన ఆందోళనపై సర్కారు స్పందించింది. చిత్రంలో బ్రాహ్మణులను కించపరిచారంటూ వారు పోరాటం చేస్తున్న నేపథ్యంలో.. సాంఘిక సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్ అధ్యక్షతన దీనిపై ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

    English summary
    
 Contrary to the reports appeared in a section of media, the committee constituted by the state government to review the controversial film 'A Woman in Brahmanism' has given thumbs down for it's makers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X