‘ఉమెన్ ఇన్ బ్రాహ్మణిజం’వివాదం ముగిసింది!

By Bojja Kumar

హైదరాబాద్: 'ది ఉమన్ ఇన్ బ్రాహ్మణిజం' సినిమాపై నెలకొన్న వివాదం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. ఈచిత్రం టైటిల్‌లోని 'బ్రాహ్మణిజం' పదాన్ని తొలగించడానికి నిర్మాత అంగీకరించారు. అదే విధంగా సినిమాలోని అభ్యంతరకర దృశ్యాలను తొలగించడానికి నిర్మాత అంగీకరించారు.

ఈ చిత్రంలో బ్రాహ్మణ మహిళలను అభ్యంతర కరంగా చూపించారని ఆరోపిస్తూ...రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. దీంతో మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి నీలం సహాని చైర్‌పర్సన్‌గా తొమ్మిదిమంది సభ్యులతో కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, డిజిపి ప్రతినిధిగా ఉమెన్ ప్రొటెక్షన్ సెల్‌కు చెందిన మహిళా అధికారికి ప్రాధాన్యం ఇస్తే మంచిదని సూచిస్తూ సీనియర్ పోలీసు అధికారి, మహిళా శిశు సంక్షేమ కార్యదర్శి నామినేట్ చేసే మహిళా సంఘాలకు చెందిన ఒక ప్రతినిధి, ఎపి ఫిలిం చాంబర్స్ ఆఫ్ అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ, తెలంగాణ ఫిలిం చాంబర్స్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి మురళీమోహన్, సమాచార శాఖ కమిషనర్ నామినేట్ చేసే బ్రాహ్మణ సంఘాల ప్రతినిధి, న్యాయశాఖ కార్యదర్శి సభ్యులుగా సమాచార శాఖ కమిషనర్ మెంబర్ సెక్రటరీగా ఈ కమిటీ ఏర్పాటయింది.

నీలం సహాని ఆధ్వర్యంలో ఏడుగురు సభ్యులు మాత్రమే కమిటీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్యాలయంలో చిత్రాన్ని తిలకించారు. మంగళవారం సాయంత్రం ఈచిత్రంపై నివేదికను ప్రభుత్వానికి అందించనున్నారు. ఈ సందర్భంగా నీలం సహాని మాట్లాడుతూ ఈ సినిమా టైటిల్ లో 'బ్రాహ్మణిజం' పేరును తొలగించేందుకు నిర్మాత ఒప్పకున్నారని, సినిమాలోని అభ్యంతర కర సన్నివేశాలను కూడా తొలగించేందుకు అంగీకరించాడని, ఈమేరకు సమాచార కమీషనర్ చంద్రవదన్‌కు నిర్మాత లేఖ రాసినట్లు వెల్లడించారు.

కాగా... ఈ రోజు జరిగిన ఈచిత్రం ప్రివ్యూనే బ్రాహ్మణ సంఘాల నేతలు బహిష్కరించారు. బ్రాహ్మణ కమ్యూనిటీ ఆందోళన మేరకు నిర్మాత దిగి వచ్చాడు. మరి బ్రాహ్మణ సంఘాల నేతలు ఈ పరిణామాలతో శాంతిస్తారో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X