నవ్వితే హ్యాపి-నవ్వకపోతే బీపి నవ్వించి కవ్వించే సినిమా

By Sindhu

నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి. ఇన్నాళ్లు నేను చేసిన నవ్వించే సినిమాలు చూశారు. వాటికన్నా 'అ ఆ ఇ ఈ" సినిమాలో ఇంకా ఎక్కువ నవ్వించే సన్నివేశాలుంటాయి. అలాగే లవ్వించే, కవ్వించే సన్నివేశాలు కూడా పుష్కలంగా ఉంటాయి. శ్రీకాంత్ పాత్ర చాలా విభిన్నంగా ఉంటుంది. మీరా జాస్మిన్, సదాలు అయితే పెర్ ఫార్మెన్స్ కనబరచడంలోనూ, గ్లామర్ ను ప్రదర్శించడంలోనూ పోటీ పడ్డారు. ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే పూతరేకులు, కజ్జికాయలు, పూర్ణం బూరెలు, గారెలతో వడ్డించిన విందుభోజనంలా ఉంటుంది" అని చెబుతున్నారు దర్శకుడు శ్రీనివాసరెడ్డి.

బొద్దం అశోక్ యాదవ్ నిర్మించిన ఈ చిత్రానికి శ్రీకాంత్, మీరాజాస్మిన్ సదా కాంబినేషన్ ఎక్స్ లెంట్ అంటున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ. ఇది ఫక్తు శ్రీనివాసరెడ్డి మార్కు సినిమా. ఈ చిత్రం చూస్తుంటే థియేటర్లలో నవ్వులు పువ్వులు పూసి జాతరవాతావరణం కనిపిస్తుంది. కుటుంబ సమేతంగా కలిసి అంతా హాయిగా చూసే సినిమా ఇది. నవంబర్ 6న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X