Aadavallu Meeku Johaarlu ట్విట్టర్ రివ్యూ: శర్వానంద్ మూవీకి షాకింగ్ టాక్.. అలా అయితేనే నచ్చుతుందట!
బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న పాత్రల్లో నటించి.. ఆ తర్వాత హీరోగా మారాడు టాలెంటెడ్ గాయ్ శర్వానంద్. సహజ సిద్ధమైన నటనతో పాటు విలక్షణమైన శైలిని ఏర్పరచుకున్న అతడు.. సుదీర్ఘ కాలంగా ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నాడు. ఈ క్రమంలోనే కొన్ని విజయాలను కూడా తన ఖాతాలో వేసుకుని స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక, ఆ మధ్యలో వరుసగా పరాజయాలు ఎదురైనప్పటికీ.. ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ఎన్నో సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'ఆడవాళ్లు మీకు జోహార్లు' అనే సినిమాతో వచ్చాడు. తాజాగా విడుదలైన ఈ మూవీ ట్విట్టర్ రివ్యూపై ఓ లుక్కేద్దాం పదండి!

ఆడవాళ్లు మీకు జోహార్లు అంటూ
శర్వానంద్ హీరోగా కిశోర్ తిరుమల తెరకెక్కించిన చిత్రమే 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ మూవీకి సంగీతం అందించాడు. ఇందులో కుస్భూ, రాధిక శరత్‌కుమార్, ఊర్వశి, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రలు చేశారు.

అంచనాలు పెంచేన వీడియోలు
ఫుల్ లెంగ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' మూవీపై ఆరంభంలో అంచనాలు పెద్దగా లేవు. కానీ, దీని నుంచి ఏది విడుదలైన భారీ రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా ఈ సినిమా టీజర్, ట్రైలర్‌కు రికార్డు వ్యూస్ వచ్చాయి. అలాగే, పాటలు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో శర్వానంద్ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

బిజినెస్ భారీగా.. రిలీజ్ గ్రాండ్‌గా
శర్వానంద్‌కు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా మార్కెట్ లేదు. దీనికితోడు అతడు వరుస పరాజయాలతో ఇబ్బందులు పడుతున్నాడు. అయినా 'ఆడవాళ్లు మీకు జోహార్లు' మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 15.75 కోట్ల బిజినెస్ జరిగింది. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. అన్ని ఏరియాల్లో కలిపి ఈ మూవీని చాలా థియేటర్లలో విడుదల చేస్తున్నారు.

శర్వానంద్ మూవీకి షాకింగ్ టాక్
శర్వానంద్ - రష్మిక మందన్నా జంటగా వచ్చిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' మూవీ ఫ్యామిలీ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్ షోలు కూడా ప్రదర్శితం అయ్యాయి. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు అన్ని చోట్ల నుంచి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. మరీ ముఖ్యంగా నెటిజన్లు దీనిపై పెదవి విరుస్తున్నారు.

ఫస్టాఫ్ ఇలా.. సెకెండాఫ్ మరోలా
'ఆడవాళ్లు మీకు జోహార్లు' మూవీ ఓవరాల్‌గా చూసుకుంటే ఫస్టాఫ్ మొత్తం ఔట్ అండ్ ఔట్ కామెడీ నేపథ్యంతో సరదాగా సాగిపోతుందట. అయితే, సెకెండాఫ్ మాత్రం యావరేజ్‌గా సాగిపోతుందని చెబుతున్నారు. ఇందులో కూడా కామెడీని ప్రధానంగా తీసుకున్నప్పటికీ.. కొన్ని ఎమోషన్స్ కూడా చూపించారట. ఇక, క్లైమాక్స్ మాత్రం కిశోర్ తిరుమల మార్కుతో ఉంటుందట.

సినిమా ప్లస్.. మైనస్‌లు ఇలాగ
'ఆడవాళ్లు మీకు జోహార్లు' మూవీని చూసిన వాళ్లంతా చేసిన ట్వీట్ల ప్రకారం.. ఇందులో శర్వానంద్ నటన, డైలాగ్స్, లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ మాత్రమే బాగున్నాయని అంటున్నారు. అయితే, డీఎస్పీ సంగీతం ఆశించిన స్థాయిలో లేదట. అలాగే, ఊహించదగ్గ కథ, నెమ్మదించిన స్క్రీన్‌ప్లే, కామెడీ పేలకపోవడం మైనస్‌లుగా మారాయని సినిమాను చూసిన వాళ్లంతా ట్వీట్లు చేస్తున్నారు.

మొత్తంగా సినిమా ఎలా ఉంది?
తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం.. శర్వానంద్ నటించిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' మూవీ పూర్తిగా ఫన్ అండ్ ఎమోషన్స్‌తో సాగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని తెలుస్తోంది. ఏమాత్రం అంచనాలు లేకుండా వెళ్లిన వాళ్లకు మాత్రమే ఇది నచ్చుతుందని సినిమాను చూసిన వాళ్లు చెబుతున్నారు. మొత్తంగా ఫ్యామిలీ కలిసి ఒకసారి చూసే సినిమా అని కామెంట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











