Don't Miss!
- News బోండా ఉమా భయం వెనుక - ఏం జరుగుతోంది..!!
- Finance Zomato: జొమాటోకు షాక్.. రూ. 11.81 కోట్ల పెనాల్టీ..!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Automobiles కొత్త మారుతి స్విఫ్ట్ బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా? ఇక్కడ చూడండి!
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
బన్నీ సినిమాలో నటించట్లేదట.. క్లారిటీ ఇచ్చిన యువ హీరో!
అల్లు అర్జున్ 'పుష్ప' పాన్ ఇండియా సినిమాగా రూపొందుతుండడంతో తెలుగు మిడియాలోనే కాకుండా ఇతర చిత్ర పరిశ్రమలో కూడా సినిమాకు సంబంధించిన వార్తలు చాలానే వస్తున్నాయి. మొదటి సారి అల్లు అర్జున్ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండడం అలాగే సుకుమార్ ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తుండడం మేజర్ హైలెట్ పాయింట్స్. ఈ రెండు అంశాలే సినిమాపై అంచనాల డోస్ ని పెంచుతున్నాయి.
ఇక సినిమాలో స్పెషల్ రోల్స్ కూడా అప్పుడప్పుడు జనాల్లో ఎక్కువగా హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి. ఇక ఈ సినిమాలో యువ హీరో ఆది పినిశెట్టి కూడా నటిస్తున్నాడు అనే టాక్ వచ్చింది. కేవలం హీరోగానే కాకుండా విలన్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆది రంగస్థలంలో చేసిన సపోర్టింగ్ రోల్ తో కూడా తన క్రేజ్ ని మరింత పెంచుకున్నాడు. బన్నీతో ఇదివరకే సరైనోడు సినిమాలో విలన్ గా చేసిన ఆది ఇప్పుడు పుష్ప సినిమాలో ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించే అవకాశం ఉందని రూమర్స్ వచ్చాయి.
అయితే ఆ వార్తలపై ఈ కుర్ర హీరో స్పందించాడు. పుష్ప సినిమాలో తాను ఎలాంటి పాత్ర చేయడానికి ఒప్పుకోలేదని చిత్ర యూనిట్ కూడా తనను ఇంతవరకు సంప్రదించలేదని అన్నాడు. దీంతో ఈ విషయంలో ఫైనల్ గా ఒక క్లారిటీ వచ్చినట్లయ్యింది. ఆది ప్రస్తుతం తమిళ్ లో రెండు సినిమాలు చేస్తున్నాడు. అలాగే కీర్తి సురేష్ గుడ్ లక్ సఖి అనే సినిమా కూడా చేస్తున్నాడు. ఇక తెలుగులో కూడా హీరోగా త్వరలో ఒక సినిమా స్టార్ట్ చేసే ఛాన్స్ ఉందట.