Aadhi Pinisetty engagement with Nikki Galrani.. సీక్రెట్‌గా నిశ్చితార్తం.. క్లారిటీ ఇచ్చిన ప్రేమజంట

సినీ పరిశ్రమలో ప్రేమ వివాహాలు చాలా కామన్. అయితే ఈ మధ్య విడాకులు వ్యవహారాలు కూడా కామన్ అయిపోయాయి అనుకోండి అది వేరే విషయం. గత కొంత కాలంగా హీరో ఆది పినిశెట్టి హీరోయిన్ నిక్కీ గల్రానీ ప్రేమ లో ఉన్నాడని త్వరలోనే వీరి పెళ్లి జరిగే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ వచ్చింది. అయితే ఈ విషయం మీద ఎట్టకేలకు ఆ హీరో, హీరోయిన్లు అధికారిక ప్రకటన కూడా చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

విలన్‌గా కూడా

విలన్‌గా కూడా

దర్శకుడు రవిరాజా పినిశెట్టి సినీ వారసుడిగా రంగ ప్రవేశం చేసిన ఆది పినిశెట్టి తెలుగులో అనేక సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. కోలీవుడ్‌లో కమర్షియల్ హీరోగా రాణిస్తూనే తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సత్తా చాటుతున్నారు. విలన్‌గా కూడా మెప్పిస్తున్నారు. 'రంగస్థలంలో కుమార్ బాబు అనే పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచిన ఆది ఆ తర్వాత 'నీవెవరో', 'యూటర్న్' చిత్రాల్లో నటించారు.

 సంజన గల్రాని సోదరి

సంజన గల్రాని సోదరి


అయితే సునీల్ సరసన కృష్ణాష్టమి సినిమాలో నటించిన హీరోయిన్ నిక్కీ గల్రానితో ఆది ప్రేమలో ఉన్నాడని అంటున్నారు. కర్నాటకకు చెందిన నటి సంజన గల్రాని సోదరి అయిన నిక్కీ గల్రాని దక్షిణాదిలో పలు చిత్రాల్లో నటించింది. తెలుగులో నిక్కీ గల్రాని.. సునీల్ సరసన కృష్ణాష్టమి, ఆది పినిశెట్టి సరసన మలుపు అనే సినిమాల్లో కూడా నటించింది.

షూటింగ్ సమయంలోనే

షూటింగ్ సమయంలోనే


టాలీవుడ్ లో నిక్కీ గల్రాని పెద్దగా పాపులర్ కాలేదు కానీ తమిళంలో కొంచెం ఇక్కడితో పోలిస్తే ఎక్కువ సినిమాలు చేసింది. ఆది పినిశెట్టి-నిక్కీ గల్రని కలిసి రెండు సినిమాల్లో నటించారు. ఆ రెండు సినిమాలు తెలుగులో మలుపు, మరకత మణి.. పేరుతో విడుదల అయ్యాయి. ఈ సినిమాల షూటింగ్ సమయంలోనే ఈ జంట ప్రేమలో పడిందని పెద్ద ఎత్తున తమిళ మీడియా ప్రచారం చేసింది.

 ఎంగేజ్మెంట్ ప్రకటిస్తున్నామని

ఎంగేజ్మెంట్ ప్రకటిస్తున్నామని


ఈ ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతూ ఉండగానే ఇప్పటివరకు వీరి ప్రేమ విషయం మీద వీరిద్దరూ నోరు విప్పింది లేదు. తాజాగా ఆది సన్నిహిత బంధువు ద్వారా ఆది, నిక్కీ ల వివాహానికి ఇరు కుటుంబాల వారు ఒప్పుకున్నారని, త్వరలోనే వీరి నిశ్చితార్థం జరగనుందనే వార్త బయటకు వచ్చింది. ఎట్టకేలకు అది నిజమేనని ఈ ఇరువురూ బయట పెట్టారు. జీవితంలో మనల్ని అర్ధం చేసుకునే వారు దొరకడం ఒక అదృష్టం. మేము కొన్ని సంవత్సరాల క్రితం ఒకరినొకరు కనుగొన్నాము,ఇప్పుడు అధికారికంగా మా ఎంగేజ్మెంట్ ప్రకటిస్తున్నామని ఆది పేర్కొన్నారు.

 ఇక అఫీషియల్

ఇక అఫీషియల్


24.3.2022, ఈ రోజు మాకు నిజంగా ప్రత్యేకమైనది అని ఆయన అన్నారు. మేము కలిసి చేసే ఈ కొత్త ప్రయాణంలో మీ అందరి ప్రేమ & దీవెనలు కోరుతూ మా ఇద్దరి కుటుంబాల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నామని అని ఆది ప్రకటించారు. ఇక టాలీవుడ్‌కు చెందిన కొంతమంది స్నేహితులతో రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నట్లు కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఎట్టకేలకు వారే అధికారకంగా ప్రకటించారు కాబట్టి ఇక అఫీషియల్ అయిపోయినట్టే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X