‘గాలిపటం’ సాయంతో గట్టెక్కానంటున్న హీరో ఆది (ఫోటోస్)
హైదరాబాద్: లవ్ లీ రాక్ స్టార్ ఆది హీరోగా నవీన్ గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన 'గాలిపటం' చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం కలెక్షన్స్ బాగున్నాయంటూ యూనిట్ సభ్యులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు. సంపత్ నంది, కిరణ్ ముప్పవరపు, విజయ్ కుమార్ వట్టికూటి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
సంపత్ నంది టీమ్ వర్క్స్, లాస్ ఏంజిల్స్ టాకీస్ బ్యానర్లపై ఈ చిత్రం రూపొందింది. ఆది, ఎరికా ఫెర్నాండెజ్, క్రిస్టినా అఖీవా, ప్రీతీ రానా నాయకా నాయికలుగా నటించిన ఈ చిత్రంలో రాహుల్ రవీంద్రన్ అతిథి పాత్ర చేశారు. తన గత రెండు చిత్రాలు ప్లాపయ్యాయని, గాలిపటం సాయంతో మళ్లీ ఒడ్డున పడ్డానని ఆది చెప్పుకొచ్చారు.
స్లైడ్ షోలో ఫోటోలు, సక్సెస్ మీట్ విశేషాలు....

ఆది మాట్లాడుతూ
గత రెండు సినిమాలు సరైన విజయం సాధిచంలేదు. గాలిపటంతో సక్సెస్ లేదనే లోటు తీరింది. ఈ సినిమా నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. చాలా డిఫరెంట్ సినిమా ఇది. కలెక్షన్స్ బాగున్నాయి. సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్ అన్నారు.

సంపత్ నంది మాట్లాడుతూ
'ఆడియన్స్ సినిమా కొత్తగా ఉందని అంటున్నారు. ఈ సినిమా విజయానికి కారణం టీమ్. టీమందరూ సమిష్టిగా కృషి చేయడం వల్లే ఇంత విజయం సాధించింది. ఫస్టాప్ యూత్ కి, సెకండాఫ్ ఫ్యామిలీస్ కి బాగా కనెక్ట్ అవుతోందని తెలిపారు.

దర్శకుడు నవీన్ గాంధీ మాట్లాడుతూ
'సినిమా విజయం సాధించడం పట్ల హ్యాపీగా ఉన్నాను. అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. సినిమాని ఇలాగే ఆదరిస్తూ, మమ్ముల్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను అన్నారు.

స్టార్స్ అండ్ టెక్నీషియన్స్
ఈ చిత్రంలో కార్తీక్, ప్రాచి, భరత్, పోసాని, భార్గవి, దువ్వాసి, ప్రగతి తదితరులు నటించారు. కెమెరా: కె. బుజ్జి, ఆర్ట్: డి.వై. సత్యనారాయణ, ఎడిటింగ్: రాంబాబు.


Click it and Unblock the Notifications











