తన ఎదుగుదలే ముఖ్యం అనుకొనే 'సుకుమారుడు'

By Srikanya

హైదరాబాద్ : ''సినిమాలో నా పేరు సుకుమార్‌. పేరుకే సుకుమారుడు కానీ అసలు కుటుంబ సంబంధాలు పట్టనివాడు. తన ఎదుగుదలే ముఖ్యం అనుకొనే తత్వం ఉన్నవాడు. అలాంటి కుర్రాడికి ప్రేమానురాగాల విలువ ఎలా తెలిసిందన్నది కథలో కీలకాంశం. అంటూ తన తాజా చిత్రం 'సుకుమారుడు' గురించి ఆది చెప్పుకొచ్చారు. 'సుకుమారుడు' చిత్రం ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకొస్తుంది.

అలాగే ... దర్శకుడు అశోక్‌ కథ చెప్పిన విధానం నాకు బాగా నచ్చింది. ఆయన నా పాత్రనే కాదు.. సినిమాలో అన్ని పాత్రలను బాగా తీర్చిదిద్దారు. సినిమా చూసిన వారందరికీ ఈ పాత్రలు గుర్తుండిపోతాయి. దర్శకుడు ఇచ్చిన ఓ ఆలోచనతో హాలీవుడ్‌ నటుడు జిమ్‌క్యారీ తరహాలో నటించేందుకు ప్రయత్నించాను అన్నారు.

ఇక ''ఎన్టీరామారావు గారి మయసభ సంభాషణనని ఒకే టేక్‌లో చెప్పేశాను. ఇది అందరికీ నచ్చుతుంది. ఇప్పటి వరకు మూడు సినిమాలే చేసినా.. చాలా విషయాలు నేర్చుకున్నాను. ప్రతి సినిమాలోనూ.. ప్రతి ఒక్క నటుడు, సాంకేతిక నిపుణుడి నుంచి ఏదోక విషయం తెలిసేది. 'లవ్‌లీ' క్త్లెమాక్స్‌లో ఏడు పేజీల సంభాషణలను చెప్పాల్సి వచ్చింది. ఆ అనుభవం ఈ సినిమాలో ఉపయోగపడింది. ఫైట్స్‌ విషయంలోనూ పలు జాగ్రత్తలు తీసుకున్నాను'' అన్నారు.

అంతేకాదు... ''నా తొలి సినిమా నుంచీ అనూప్‌ రూబెన్స్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఆయన సంగీతం యువతనే కాదు.. అందరినీ కట్టిపడేసేలా ఉంటుంది. సుదీర్ఘమైన అనుభవం ఉన్న శారద, కృష్ణ గార్లతో నటించడం ఓ అదృష్టం. కృష్ణగారు నేను కలిసి కనిపించే దృశ్యాలు చాలా తక్కువ. అయినా ఆయనతో చేసిన క్షణాలన్నీ మరిచపోలేనివి. నిషా అగర్వాల్‌ పల్లెటూరు యువతిగా కనిపిస్తుంది. మరో నాయికగా భావన నటించింది. వీరి పాత్రలూ అందరికీ నచ్చుతాయి'' అని చెప్పుకొచ్చారు.

ఆది, నిషా అగర్వాల్, భావన ముఖ్య పాత్రలో ఊర్వశి శారద, ఓ ప్రత్యేక పాత్రలో సూపర్ స్టార్ కృష్ణ నటిస్తున్న ఈ చిత్రంలో ఎం.ఎస్.నారాయణ, తనికెళ్ల భరణి, రావు రమేష్, చలపతిరావు, సంజయ్, తాగుబోతు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, ఫొటోగ్రఫీ: శ్రీరామ్, ఎడిటింగ్: ప్రదీప్, ఆర్ట్: రామ్, డాన్స్: జులాయి శేఖర్, కో ప్రొడ్యూసర్: బాబ్జీ, సమర్పణ: కె.వి.వి.సత్యనారాయణ, నిర్మాత: కె.వేణుగోపాల్, కథ, స్ర్కీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: అశోక్ జి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X