ఫ్యామిలీ లవ్ స్టోరీ ('లవ్‌లీ' ప్రివ్యూ)
ప్రేమ కావాలి చిత్రంతో పరిచయమైన ఆది రెండో చిత్రం లవ్ లీ. ఫన్ తో ప్రేమ కథలు నడిపే మహిళా దర్శకురాలు బి.జయ డైరక్ట్ చేసిన ఈ చిత్రంలో ఆకాష్ గా ఆది కనిపిస్తాడు. కథ ప్రకారం మంగళంపల్లి మహారథి (రాజేంద్రప్రసాద్) కోటీశ్వరుడు. తన కూతురు లావణ్య (శాన్వి) అంటే ప్రాణం. ఆమె ఏది అడిగినా కాదనడు. లావణ్యకి కూడా తండ్రే లోకం. తన తండ్రిలో కనిపించే కొన్ని లక్షణాల్ని ఆకాష్(ఆది)లో చూస్తుంది. అతనిపై క్రమంగా మనసు పెంచుకొంటుంది.
ఇదే విషయం వాళ్ల నాన్నతో చెబుతుంది. అన్న, వదినలు నడిపే ఓ చిన్న యాడ్ ఏజెన్సీకి ఆలోచనలు ఇస్తూ గడిపే ఆకాష్‌ని అల్లుడిగా మహారథి స్వీకరించాడా? ప్రేమజంట ఒక్కటవ్వడానికి ఎలాంటి అవాంతరాలు ఎదురయ్యాయి? అనే విషయాల్ని తెరపైనే చూడాలి. చిత్రం గురించి దర్శకురాలు మాట్లాడుతూ ''వినోదం, భావోద్వేగాలతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగే చిత్రమిది. అనూప్‌రూబెన్స్ సంగీతం, శ్యామ్ మనోహర్ సంభాషణలు బలాన్నిస్తాయి''అన్నారు.
సంస్థ: ఆర్.జె.సినిమాస్
నటీనటులు: ఆది, శాన్వి, రాజేంద్రప్రసాద్, చిన్మయి, వెన్నెల కిషోర్, హర్షవర్ధన్, పరుచూరి గోపాలకృష్ణ, ఆహుతిప్రసాద్, తనికెళ్ళ భరణి, కాశీవిశ్వనాథ్ తదితరులు
నిర్మాత: బి.ఎ.రాజు
దర్శకత్వం: బి.జయ
విడుదల: శుక్రవారం.


Click it and Unblock the Notifications











