ఆది 'లవ్‌లీ' స్టోరీ లైన్ ఏంటి?
ప్రేమ కావలి చిత్రంతో పరిచయమైన సాయి కుమార్ కొడుకు ఆది రెండో చిత్రం 'లవ్‌లీ'. కథలో రాజేంద్రప్రసాద్ కు కూతురంటే ఎనలేని ప్రేమ. పంచ ప్రాణాలూ తనే. లవ్‌లీ... లవ్‌లీ... అంటూ ఎప్పుడూ లావణ్య పేరే కలవరిస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి కూడా అంతే. తండ్రి గీసిన గీతని కలలో కూడా దాటివెళ్లదు. అపురూపమైన ఈ బంధం మధ్యలోకి అనుకోకుండా ఓ యువకుడు వచ్చాడు. ప్రేమతో లవ్‌లీ మనసు గెలిచేందుకు ప్రయత్నించాడు. అది సఫలమైందో లేదో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే. ఈ నెల 30న చిత్రం విడుదల కాబోతోంది. బి.జయ దర్సకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ఆది, శాన్వి జంటగా నటించారు. బి.ఎ.రాజు నిర్మాత. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి.
హీరోయిన్ శాన్వి మాట్లాడుతూ ''నా నిజ జీవితానికి అద్దం పట్టే పాత్రని పోషించాను. సినిమాలో లావణ్యకి తండ్రి అంటే ప్రాణం. వ్యక్తిగతంగా నాకూ అంతే. తెరపై నాకు తండ్రిగా రాజేంద్రప్రసాద్ నటించారు. ఆయన్నుంచి ఎన్నో విషయాలు నేర్చుకొన్నాను. నాకిది తొలి చిత్రమే అయినా... నా నటన, నృత్యాలూ ఎంతో సంతృప్తినిచ్చాయి. దర్శకురాలు నా పాత్రని తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంది. ప్రేమ, భావోద్వేగాలు పలికించే విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకొని నటించాను. యువతరంతోపాటు, కుటుంబ ప్రేక్షకుల్నీ మెప్పిస్తుంద''న్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, సమర్పణ: ఆర్.ఆర్.మూవీమేకర్స్.


Click it and Unblock the Notifications











