twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ టైటిల్ తో సాయికుమార్ కొడుకు

    By Srikanya
    |

    సాయి కుమార్ కుమారుడు ఆది ప్రేమే కావాలి తో పరిచయమయ్యాడు. లవ్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఆ చిత్రం ఊహించిన రేంజిలో హిట్ ఇవ్వలేకపోయింది. అయితే ఇప్పుడు అతను తన రెండో చిత్రానికి శ్రీకారం చుట్టాడు. బి జయ దర్శకత్వంలో ఓ చిత్రం చేయటానికి కమిటయ్యాడు. దీనికి సంభందించిన పూజ,లాంచింగ్ రామా నాయుడు స్టూడియోస్ లో సింపుల్ గా జరిగాయి. ఈ చిత్రంలో అంచల్, శాన్వి హీరోయిన్స్ గా చేస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి లవ్ లీ అనే టైటిల్ పెట్టారు.లవ్ లీ అనే టైటిల్ ని మొదట పవన్ చిత్రం తీన్ మార్ కి అనుకుని చివరి నిముషంలో మార్చేసారు. ఇక బి జయ గతంలో చంటిగాడు, గుండమ్మగారి మనవడు చిత్రాలు నిర్మించింది.

    గుండమ్మగారి మనవడు చిత్రాన్ని నిర్మించిన ఆర్.ఆర్ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.ఇంతకు ముందు బి.జయ ...కాజల్ చెల్లెలు నిషా అగర్వాల్ తో సినిమా చేయాలని నిర్ణయించుకుంది. ఆమెకు తన లేటెస్ట్ చిత్రం డబుల్ ధమాకా లో అవకాశం ఇవ్వనుందని ప్రచారం జరిగింది. మే నెల రెండవ వారం నుండి ప్రారంభమయ్యే ఈ చిత్రం కోసం నిషా ఎగ్రిమెంట్ కాగితాలపై సైన్ చేసిందని చెప్పారు. ఇక ఈ చిత్రంలో నాని,కృష్ణుడు ఈ చిత్రంలో ఆమె కోసం పోటీపడతారని వార్తలు వచ్చాయి.జయ కూడా కన్ఫర్మ్ చేసారు. అయితే ఆ ప్రాజెక్టు ఏమైందో కానీ ఈ సినిమా మాత్రం లైన్ లోకి వచ్చింది.

    English summary
    Aadi is pairing up with the new girls Anchal and Shanvi in this flick. The film has been titled "Lovely" and it was launched at Ramanaidu Studios in a simple manner.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X