పిల్లజమిందార్ దర్శకుడితో ఆది కొత్త చిత్రం
'ప్రేమ కావాలి' వంటి సూపర్ హిట్ మూవీతో హీరోగా పరిచయమైన సాయికుమార్ తనయుడు లవ్‌లీ రాక్ స్టార్ ఆది మూడో చిత్రం గురువారం ప్రారంభం అయింది. శ్రీసౌదామిని క్రియేషన్స్ పతాకంపై 'సుందరకాండ', 'కొండపల్లి రాజా' వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన కె.వి.వి. సత్యనారాయణ ఆధ్వర్యంలో కె.వేణుగోపాల్, బాబ్జీ నిర్మాణ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. 'పిల్ల జమిందార్' దర్శకుడు అశోక్ ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. వరుస మ్యూజిక్ హిట్లు ఇస్తున్న అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగత దర్శకుడిగా ఎంపికయ్యాడు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నటుడు సాయికుమార్, హీరో ఆది, దర్శకుడు జి. అశోక్, నిర్మాతలు కె.వి.వి. సత్యానాయణ, సహనిర్మాతలు కె.వేణుగోపాల్, బాబ్జీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పలువురు చిత్ర ప్రముఖులు విచ్చేసి యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తామని దర్శక నిర్మాతలు చెప్పారు.


Click it and Unblock the Notifications











