twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సాయికుమార్ తనయుడి‘లవ్‌లీ’ వేషాలు!

    By Bojja Kumar
    |

    'ప్రేమ కావాలి" సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు నటుడు సాయికుమార్ తనయుడు ఆది. ఆ సినిమా మంచి విజయం సాధించినప్పటికీ ఆదికి మాత్రం వెంటనే అవకాశాలు రాక కొంత కాలంగా ఖాళీగా ఉన్నాడు. ఎట్టకేలకు ఆది హీరోగా రెండె సినిమా ప్రారంభం అయింది. ఆది కథానాయకుడిగా డా. రాజేంవూదవూపసాద్ ప్రధాన పాత్రలో ఆర్. ఆర్. మూవీ మేకర్స్ సమర్పణలో ఆర్.జె. సినిమాస్ పతాకంపై బి.ఎ. రాజు ఓ ప్రేమకథా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బి. జయ దర్శకురాలు. శాన్వి, చిన్మయి, ఆంచల్ నాయికలు. ఈ చిత్రానికి 'లవ్‌లీ" అనే టైటిల్‌ని ఖరారు చేశారు.

    లవ్‌లీ స్టార్‌గా ఈ చిత్రంతో ఆది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆది ఇందులో చాలా కొత్తగా కనిపిస్తాడు. అతనికి హీరోగా మంచి పేరు తెచ్చే చిత్రమిది. చిత్రాన్ని జనవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం అని దర్శకురాలు బి. జయ అన్నారు. బి.ఎ. రాజు మాట్లాడుతూ ' చిన్న చిత్రంగా విడుదలైన 'ప్రేమకావాలి" చిత్రం పెద్ద విజయాన్ని సాదించింది. లవ్‌లీ సినిమా కూడా మంచి వియం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

    English summary
    Actor Aadi who debuted in Tollywood with Prema Kavali has accepted a new film titled Lovely. B.Jaya is wielding the megaphone for this youthful love entertainer and it will be produced by B A Raju and RR Movie Makers will present the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X