Don't Miss!
- News షర్మిల గురి మారిందా - వారి ఆశలపై నీళ్లు, ఫలితం తారుమారు..!!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్‌ను కూడా
- Finance RBI: 2000 నోట్లపై కీలక ప్రకటన చేసిన ఆర్బీఐ..
- Technology 50MP సెల్ఫీ కెమెరా తో Samsung కొత్త ఫోన్! లాంచ్,ధర వివరాలు
- Automobiles ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్‌లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సాయికుమార్ తనయుడి‘లవ్లీ’ వేషాలు!
'ప్రేమ కావాలి" సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు నటుడు సాయికుమార్ తనయుడు ఆది. ఆ సినిమా మంచి విజయం సాధించినప్పటికీ ఆదికి మాత్రం వెంటనే అవకాశాలు రాక కొంత కాలంగా ఖాళీగా ఉన్నాడు. ఎట్టకేలకు ఆది హీరోగా రెండె సినిమా ప్రారంభం అయింది. ఆది కథానాయకుడిగా డా. రాజేంవూదవూపసాద్ ప్రధాన పాత్రలో ఆర్. ఆర్. మూవీ మేకర్స్ సమర్పణలో ఆర్.జె. సినిమాస్ పతాకంపై బి.ఎ. రాజు ఓ ప్రేమకథా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బి. జయ దర్శకురాలు. శాన్వి, చిన్మయి, ఆంచల్ నాయికలు. ఈ చిత్రానికి 'లవ్లీ" అనే టైటిల్‌ని ఖరారు చేశారు.
లవ్లీ స్టార్‌గా ఈ చిత్రంతో ఆది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆది ఇందులో చాలా కొత్తగా కనిపిస్తాడు. అతనికి హీరోగా మంచి పేరు తెచ్చే చిత్రమిది. చిత్రాన్ని జనవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం అని దర్శకురాలు బి. జయ అన్నారు. బి.ఎ. రాజు మాట్లాడుతూ ' చిన్న చిత్రంగా విడుదలైన 'ప్రేమకావాలి" చిత్రం పెద్ద విజయాన్ని సాదించింది. లవ్లీ సినిమా కూడా మంచి వియం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.