హీరో ఆదికి అందాల నిషా!
తన తొలి సినిమా 'ప్రేమ కావాలి' చిత్రంతోనే హిట్ కొట్టిన ఆది...ఇటీవల విడుదలైన 'లవ్‌లీ'తో ఇటు ఫ్యామిలీ ప్రేక్షకులను కూడా అలరించి.....ఈ జనరేషన్ యంగ్ హీరోల్లోని మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఈచిత్రం తర్వాత ఆది.. అశోక్ దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయిన విషయం తెలిసిందే.
ఈచిత్రంలో కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషా అగర్వాల్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ప్రస్తుతం ఈచిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్కు జరుగుతోంది. ఈ చిత్రానికి 'సుకుమారుడు' అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది.
ఇదివరకు 'పిల్ల జమిందార్' లాంటి మంచి చిత్రాన్ని రూపొందించిన అశోక్....ఈ చిత్రాన్ని ఆది బాడీ లాంగ్వేజ్‌కి తగిన విధంగా రూపొందిస్తున్నాడు. ప్రేమకథాంశంతో రూపొందుతున్న ఈచిత్రం ద్వారా ఓ మంచి మెసేజ్‍ను కూడా ఇవ్వబోతున్నారు.
కె.వి సత్యనారాయ, కె. వేణుగోపాల్, బాబ్జీ ఈచిత్రాన్ని సంయుక్తంగా సౌదామని క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఆది గత చిత్రాలకు సూపర్ హిట్ మ్యూజిక్ అందించిన అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి కూడా స్వరాలు సమకూర్చుతున్నాడు.
గతంలో ఈచిత్రాన్ని సిద్ధార్థ హీరోగా ప్లాన్ చేసుకున్న దర్శకుడు అశోక్....సిద్దార్థతో డేట్స్ అడ్జెస్ట్ కాక పోవడంతో పాటు మరికొన్ని కారణాల వల్ల అతన్ని పక్కన పెట్టి ఆది హీరోగా ఎంపిక చేసుకున్నాడు.


Click it and Unblock the Notifications











