సమంతను సినిమా నుంచి తీసేద్దామనుకొన్నారట.. యూటర్న్ అంటే అదే మరీ
Recommended Video

నాగచైతన్యతో పెళ్లి తర్వాత కూడా అందాల నటి సమంత అక్కినేని సినిమాల జోరు పెంచేస్తున్నది. 2016లో ఘన విజయం సాధించిన కన్నడ చిత్రం యూటర్న్ లో తాజాగా సమంత నటిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సమంత సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో రీమేక్ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు మీకోసం..

పెళ్లి కారణంగా యూటర్న్
కొద్ది నెలల క్రితం యూటర్న్ చిత్రాన్ని సమంత కోసం బెంగళూరులో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఆ చిత్రాన్ని చూసిన వెంటనే సమంత ఆ చిత్రాన్ని చేయడానికి అంగీకరించారు. అయితే కేవలం నటించకుండా స్వయంగా ఆ చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధపడటం గమనార్హం. కానీ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ నిర్మాతగా మారడంతో అది సాధ్యపడలేదు. ఈ చిత్రం ఎప్పుడో సెట్స్‌పైకి వెళ్లాల్సి ఉండాల్సింది. కానీ పెళ్లి కారణంగా జాప్యం జరిగింది.

యూటర్న్ గురించి సమంత
గత మంగళవారం యూటర్న్ రీమేక్ గురించిన వార్తను సమంత ట్విట్టర్‌లో ధ్రువీకరించింది. యూటర్న్ చిత్రాన్ని తమిళ, తెలుగు భాషల్లో రూపొందిస్తున్నాను. ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభమవుతుంది అని సమంత ట్వీట్ చేసింది.

యూటర్న్‌లో రాహుల్.. ఆది
ఈ చిత్రంలో నటించే నటుల ఎంపిక కూడా ప్రారంభమైంది. ఆది పినిశెట్టి పోలీస్ ఆఫీసర్‌గా, రాహుల్ రవీంద్రన్ సమంత బాయ్‌ఫ్రెండ్‌గా నటించనున్నారనేది తాజా సమాచారం. ఇంకా పూర్తిస్థాయిలో నటీనటులు ఎంపిక పూర్తి కాలేదు. త్వరలోనే మిగితా నటీనటులు ఎంపిక గురించి వెల్లడిస్తాం అని దర్శకుడు పవన్ కుమార్ వెల్లడించారు.

భారీస్ఠాయిలో యూటర్న్
దర్శకుడు పవన్ కుమార్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కావొస్తున్నాయి. సమంత ఈ ప్రాజెక్ట్‌లో చేరడంతో మరింత క్రేజ్ వచ్చింది. ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నాం అని అన్నారు.

బిజీగా సమంత అక్కినేని
2018 సంవత్సరంలో సమంత బిజీగా మారిపోయింది. విశాల్ సరసన ఇరంబు థిరైలో నటించారు. అలాగే సావిత్రం బయోపిక్, రంగస్థలం రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. విజయ్ సేతుపతి సూపర్ డీలక్స్ సినిమా, శివకార్తీకేయన్ పోన్రాం చిత్రం షూటింగ్ దశలో ఉన్నాయి.

సమంతకు బదులుగా నయన
తొలుత యూటర్న్ చిత్రంలో సమంతకు బదులు నయనతార లేదా నిత్యామీనన్‌ను తీసుకోవాలని అనుకొన్నారట. అయితే నయనతార బిజీగా ఉండి డేట్స్ కేటాయించలేకపోవడం, నిత్యమీనన్‌ను ఏదో కారణంగా పక్కన పెట్టడం వల్ల మళ్లీ సమంతనే ఈ అవకాశం వరించింది. అంతేకాకుండా సమంత నిర్మాతగా మారి హంగామా చేస్తున్నది.


Click it and Unblock the Notifications











