'గబ్బర్ సింగ్ -3' లో హీరోగా ట్రై చేస్తున్నాడా? (వీడియో)
హైదరాబాద్ : ఈడేమన్నా గబ్బర్ సింగ్ 3 సినిమాలో హీరోగా ట్రై చేస్తున్నాడా ఏంటి అంటూ జయప్రకాష్ రెడ్డి అడుతూంటే చమ్మక్ ఛంద్ర ..లేదు...ఏదో అమ్మాయిని ట్రై చేస్తున్నట్లు ఉన్నాడు అంటూ ఫన్ గా చెప్పే డైలాగుతో రఫ్ చిత్రం ట్రైలర్ విడుదలైంది. పూర్తి మాస్ టచ్ తో ఈ ట్రైలర్ ని తీర్చి దిద్దారు దర్శకుడు సుబ్బారెడ్డి. చాలా కాలం క్రితమే ప్రారంభమై ఫండ్స్ లేమితో ప్రాజెక్టు డిలే అయింది. ఇన్నాళ్లుకు ఇదిగో ఇలా ప్రోమోతో వస్తున్నాడు. మీరు ఈ రఫ్ ప్రోమో చూసి నిజంగానే రఫ్ గా ఉందో లేదో చెక్ చేయండి.
ఆది, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం 'రఫ్'. ఈ చిత్రం ఆడియో విడుదల వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. మణిశర్మ సంగీతమందించిన ఈ చిత్ర ఆడియోను హీరోలు సూర్య, నితిన్‌లు విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి రానా, అల్లరి నరేష్, సాయికుమార్, దర్శకులు బోయపాటి శ్రీను, పైడిపల్లి వంశీ, సెంథిల్‌కుమార్ తదితరులు హాజరయ్యారు.

కోపం వస్తే రఫ్ ఆడించే ఓ కుర్రాడు ఓ అందమైన అమ్మాయి ప్రేమలో పడ్డాడు. ప్రేమ కోసం ఎంతకైనా తెగించే టైప్ అతను. తన ప్రేమకి అడ్డొచ్చిన వారిని ఎలా 'రఫ్' ఆడించి తన ప్రేయసిని సొంతం చేసుకున్నాడనేది...ఆది, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘రఫ్' సినిమా స్టోరీ లైన్.
సినిమా గురించి ఆది వివరిస్తూ....ప్రేమ కోసం ఏదైనా చేసే యువకుడిగా నటిస్తున్నాను. యాక్షన్, లవ్, ఎంటర్‌టైన్‌మెంట్, రొమాన్స్ అన్ని కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉన్న చిత్రమిది. మణిశర్మగారు చక్కని సంగీతం అందించారు. నా గత చిత్రాలతో పోలిస్తే మ్యూజికల్‌గా పెద్ద హిట్టవుతుంది.
తనికెళ్ల భరణి, కాశీ విశ్వనాధ్, జయప్రకాష్ రెడ్డి, రఘుబాబు, సుప్రీత్, అజయ్, కృష్ణభగవాన్, శివారెడ్డి, సుహాసిని, అదుర్స్ రఘు, పవిత్రా లోకేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు - మరుధూరి రాజా, పాటలు - భాస్కర భట్ల, ఫైట్స్ - రామలక్ష్మణ్, డ్యాన్స్ - బాబా భాస్కర్, భాను, ఆర్ట్ - సీతారామాంజనేయులు, ఎడిటర్ - మార్తాండ్ .కె.వెంకటేష్, డి.ఓ.పి - కె. కె.సెంధిల్ కుమార్, అరుణ్ కుమార్, సంగీతం - మణిశర్మ, నిర్మాత - ఎమ్.అభిలాష్, కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - సి.హెచ్.సుబ్బారెడ్డి.


Click it and Unblock the Notifications











