బోల్డ్ సినిమానా? ( ‘గాలిపటం’ప్రివ్యూ)
హైదరాబాద్: ఒక స్టార్ డైరక్టర్ తన స్నేహితుడుని నమ్మి నిర్మాతగా సినిమా చేస్తున్నాడంటే ఖచ్చితంగా అంచనాలు ఉంటాయి. ముఖ్యంగా తన కథ,కథనాలు, మాటలుతో తన రెండు చిత్రాలు హిట్ కొట్టిన సంపత్ నంది నుంచి వస్తున్న సినిమాపై టాలీవుడ్ లోనే కాదు బయిటా ఆసక్తికరంగా ఉంది. బోల్డ్ సినిమాగా ప్రమోట్ చేయబడుతున్న ఈ చిత్రం ఎంత వరకూ డబ్బులు తెచ్చి పెట్టే చిత్రం అవుతుందనేది మరి కొద్ది గంటల్లో తేలనుంది.
సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసే ఒక అబ్బాయి, ఇద్దరమ్మాయిల మధ్య సాగే కథ. ఈ చిత్రంలో లో ఆది పాత్ర పేరు కార్తీక్, అతను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి పెద్ద ఫ్యాన్. ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే నేను తను ప్రేమించే అమ్మాయి కోసం తన జాబుని వదిలేసి ఏం చేసాడు అన్నదే పాత్ర. ఇందులో ఆది బిహేవియర్, బాడీ లాంగ్వేజ్ చాలా కొత్తగా ఉంటుంది.
ఇలాంటి జోనర్ సినిమాలు ఇప్పటి వరకూ బాలీవుడ్ లోనే వచ్చాయి, తెలుగులో రావడం ఇదే మొదటిసారి. సినిమా చాలా బోల్డ్ గా ఉంటుంది. ప్రస్తుతం యువత ఎదుర్కొంటున్న కాంటెంపరరీ పాయింట్స్ ని ఇందులో చూపించారు. ఇందులో మొత్తం 8 పాత్రలు ఉంటాయి. అన్నిటినీ బాగా డిజైన్ చేసారు అలాగే పర్ఫెక్ట్ ఎండింగ్ కూడా ఇచ్చారు. ఫస్ట్ హాఫ్ బాగా యూత్ఫుల్ అండ్ ఎనర్జిటిక్ గా ఉంటే సెకండాఫ్ బాగా ఎమోషనల్ గా ఉంటుంది అని చెప్తున్నారు.

సంపత్‌నంది మాట్లాడుతూ ''మేం సినిమాను ఎప్పుడు మొదలుపెట్టాం? ఎప్పుడు పూర్తి చేశాం? అన్న విషయం చాలా మందికి తెలియదు. కానీ ప్రమోషన్ మొదలుపెట్టాక మంచి వైబ్రేషన్స్ మొదలయ్యాయి. పాజిటివ్ టాక్ వస్తోంది. సెన్సార్ పూర్తయిది. ఎ సర్టిఫికెట్ వచ్చింది. ఇందులో ఓ లిప్‌లాక్ సన్నివేశం ఉంది. అందుకే ఆ సర్టిఫికెట్ ఇచ్చారు. సాఫ్ట్‌వేర్ కపుల్ గురించి చూపించాం. ఆది పెర్ఫార్మెన్స్ బావుంటుంది. భీమ్స్ మంచి సంగీతాన్నిచ్చారు'' అని తెలిపారు.
ఆది మాట్లాడుతూ ''చాలా మంచి సినిమా అని అందరూ అంటున్నారు. భీమ్స్ సంగీతానికి చక్కటి స్పందన వస్తోంది. గాలిపటం నాకు ఐదో సినిమా. నాకు చాలా మంచి సినిమా అవుతుంది. కెమెరా పనితనం హైలైట్ అవుతుంది. బోల్డ్ సినిమా ఇది'' అని చెప్పారు.
ఎరికా మాట్లాడుతూ ''ఇది నా తొలి సినిమా. చాలా బావుంటుంది. చక్కటి టీమ్‌తో పనిచేసినందుకు ఆనందంగా ఉంది'' అని అన్నారు. కిరణ్ మాట్లాడుతూ ''సినిమా బాగా వచ్చింది. సెన్సార్ సభ్యులు ఎ సర్టిఫికెట్‌నిచ్చారు. అందరికీ నచ్చే సినిమా అవుతుంది'' అని తెలిపారు. భీమ్స్ మాట్లాడుతూ ''పాటలకు మంచి స్పందన వస్తోంది. ఈ మధ్య కాలంలో బెస్ట్ ఆల్బమ్ ఇదేనని అంటున్నారు'' అని చెప్పారు.
బ్యానర్: సంపత్‌నంది టీమ్ వర్క్స్
నటీనటులు: ఆది, ఎరికా ఫెర్నాండెజ్, క్రిస్టినా అఖీవా, పోసాని కృష్ణమురళి, భరత్‌రెడ్డి, కార్తీక్, ప్రాచి, సప్తగిరి, చంద్ర, దువ్వాసి, శివన్నారాయణ, హేమ, ప్రగతి, శకుంతల, గీతాంజలి తదితరులు
కెమెరా: బుజ్జి,
సంగీతం: భీమ్స్,
నిర్మాతలు: సంపత్‌నంది, కిరణ్ ముప్పవరపు, విజయ్‌కుమార్ వట్టికూటి,
దర్శకత్వం: నవీన్ గాంధి.


Click it and Unblock the Notifications











