ఆది కొత్త చిత్రం 'రఫ్' ఫస్ట్ లుక్ ఇదే
హైదరాబాద్ : రీసెంట్ గా సుకుమారుడు చిత్రంతో డిజాస్టర్ రుచి చూసిన ఆది తాజా చిత్రానికి 'రఫ్' అనే టైటిల్ ఖరారు చేసారు. ఆదివారం ఈ చిత్రం ఫస్ట్ లుక్ , సినిమా లోగో ని శ్రీహరి చేతుల మీదుగా విడుదల చేసారు. 'రఫ్'లో ఆది, రకుల్ ప్రీతిసింగ్ జంటగా నటిస్తున్నారు.
హీరో ఆది మాట్లాడుతూ... ''మాస్, యాక్షన్ అంశాలకు పెద్ద పీట వేసిన ప్రేమ కథ ఇది. దీనికి 'రఫ్' అనే పేరు అతికినట్లు సరిపోతుంది''అన్నారు . శ్రీహరి ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. శ్రీహరి మాట్లాడుతూ....''ఆది ఇప్పటి వరకూ ప్రేమ కథా చిత్రాలే చేశాడు. ఓ లవర్ బాయ్‌గానే చూశాం. ఇప్పుడు మాస్ పాత్రలోనూ తక్కువేం కాదని నిరూపించబోతున్నాడు''అన్నారు శ్రీహరి.
దర్శకుడు సీహెచ్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ''లవర్‌బాయ్‌గా గుర్తింపు పొందిన ఆది ఈ చిత్రంలో తన ఫైర్‌ను చూపించనున్నాడని, దాదాపుగా 50 శాతం షూటింగ్ పూర్తిచేశామని తెలిపారు. 27 నుండి మూడో షెడ్యూల్ ప్రారంభిస్తున్నామని, జూలైలో పాటల చిత్రీకరణ జరిపి ఆగస్టులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. కథను విన్నవారందరూ దమ్ముందని చెప్పడంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని, అందరూ ఇచ్చిన ధైర్యంతోనే ముందుకెళ్తున్నామని, మూడు పాటలు రికార్డింగ్ అయ్యాయని, అందులో ఒక పాట చిత్రీకరణ పూర్తిచేశామని దర్శకుడు తెలిపారు. రఫ్‌గా ఉండే ఓ కుర్రాడి కథగా సినిమా ఉంటుందని, ఆదికి అభిమాని అయ్యాక అతడిని తాను ఎలా చూడాలనుకుంటున్నానో అలా ఈ చిత్రంలో చూపే ప్రయత్నం చేస్తున్నాను''అన్నారు.
కథాబలం ఉన్న చిత్రమిది. ఆది, శ్రీహరిల పాత్రలు ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. తూటాలా దూసుకొచ్చే కుర్రాడిలా ఆది కనిపిస్తాడు ఆగస్టులో చిత్రాన్ని విడుదల చేస్తామన్నారు నిర్మాత మాధవరం అభిలాష్ . బ్రహ్మానందం, ఎం.ఎస్.నారాయణ, రఘుబాబు, జయప్రకాష్‌రెడ్డి, రవిప్రకాశ్, రాజా రవీంద్ర, నాగినీడు, పవిత్రా లోకేష్, సామ్రాట్ శివారెడ్డి, అదర్స్ రఘు, పృధ్వి, ధన్‌రాజ్, కాట్రాజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:మణిశర్మ, మాటలు:మరుధూరి రాజా, కెమెరా:కె.కె.సెంథిల్‌కుమార్, ఫైట్స్:గణేశ్, ఎడిటింగ్:మార్తాండ్ కె.వెంకటేష్, పాటలు:్భస్కరభట్ల, నిర్మాత:మాధవరం అభిలాష్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:సిహెచ్.సుబ్బారెడ్డి.


Click it and Unblock the Notifications












