బాలకృష్ణ దర్శకుడుతో ఆది నెక్ట్స్ ఖరారు
ప్రస్తుతం ఆది చేస్తున్న చిత్రం 'రఫ్'. ఆది, రకులీప్రీతిసింగ్ జంటగా శ్రీదేవి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మాధవరం అభిలాష్ నిర్మాతగా సి.హెచ్.సుబ్బారెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ఒక పాట మినహా టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది.
రఫ్ దర్శకుడు మాట్లాడుతూ- ''ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ రామానాయుడు స్టూడియోలో జరుపుతున్నాం. ఈ చిత్రం ఆదికి మరింత మంచి గుర్తింపుని తెచ్చుపెడుతుందన్న నమ్మకం వుంది. మా బ్యానర్‌కు కూడా ఈ చిత్రం ద్వారా మంచి గుర్తింపు లభిస్తుంది. ఒక పాట మినహా చిత్రం టాకీపార్ట్ మొత్తం పూర్తయింది. ఈ చిత్రానికి మణిశర్మ అందించిన ఐదు పాటలు ఆణిముత్యాల్లా వున్నాయి. ఈ పాటలు శ్రోతలను విశేషంగా అలరించనున్నాయి. త్వరలోనే ఆడియోను విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాం. నిర్మాత చక్కటి సహాకారంతో చిత్రాన్ని త్వరగా పూర్తి చేశాం'' అని చెప్పారు.
నిర్మాత మాధవరం అభిలాష్ మాట్లాడుతూ-'' లవ్‌లీ చిత్రం ద్వారా ఆది నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. సాయికుమార్ తనయుడిగానే గాక, ఒక నటుడుగా ఆది తనని తాను నిరూపించుకుంటున్నాడు. ఆయన చేస్తున్న చిత్రాలు, అందులోని పాత్రలను చూస్తుంటే ఆదికి ఎంతో భవిష్యత్తు ఉందనిపిస్తుంది. మా ఈ 'రఫ్' చిత్రం కూడా ఆదికి మంచి ఇమేజ్‌ని తెచ్చిపెడుతుందన్న నమ్మకం మాకుంది. దర్శకుడు చిత్రాన్ని తీర్చిదిద్దిన తీరు బావుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం''అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, నిర్మాత:మాధవరం అభిలాష్, దర్శకత్వం: సి.హెచ్.సుబ్బారెడ్డి.


Click it and Unblock the Notifications












