ఆది 'సుకుమారుడు' స్టోరీ లైన్ ఏంటి?

By Srikanya

ప్రేమే కావాలి చిత్రంతో పరిచయం అయిన యంగ్ హీరో ఆది. ప్రముఖ క్యారెక్టర్ మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్ సాయికుమార్ కుమారుడైన ఆది ఆ మధ్యన బి.జయ దర్శకత్వంలో లవ్ లీ అనే చిత్రం సైతం చేసారు. అయితే ఈ రెండు చిత్రాలు ఊహించనంత ఫలితం ఇవ్వలేదు. దాంతో ఇప్పుడు పూర్తిగా ఉమ్మడి కుటుంబ నేపధ్యంలో జరిగే ప్రేమకథతో ముందుకొస్తున్నాడు. పిల్ల జమీందార్ చిత్రంతో పరిచయమైన అశోక్ హీరోగా రూపొందే ఈ చిత్రం టైటిల్ 'సుకుమారుడు'.

ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ ....అమెరికా నుంచి వచ్చిన మనవణ్ని చూసిన ఆ పెద్దాయనకు తన టీనేజ్‌ గుర్తుకొచ్చింది. పాశ్చాత్య సంస్కృతిలో పెరిగిన ఆ అబ్బాయికి తెలుగుదనాన్ని ఎలా రుచి చూపించారు? ఇక్కడి పద్ధతులకు ఆ అల్లరి కుర్రాడు అలవాటుపడ్డాడో లేదో తెర మీదే చూడాలి అన్నారు. 'సుకుమారుడు'లో ఆది సరసననిషా అగర్వాల్‌, నీలమ్‌ ఉపాధ్యాయ హీరోయిన్స్ గా చేస్తున్నారు. ప్రముఖ నటులు కృష్ణ, శారద ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రంలో హీరో,హీరోయిన్స్ పై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ''అమెరికా అబ్బాయికీ, ఉమ్మడి కుటుంబంలో పుట్టి పెరిగిన ఓ తెలుగమ్మాయికీ మధ్య ప్రేమ చిగురించిన తీరు గమ్మత్తుగా ఉంటుంది. ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుందీ చిత్రం'' అన్నారు. బ్రహ్మానందం, గొల్లపూడి మారుతీరావు, అవసరాల శ్రీనివాస్‌, తనికెళ్ళ భరణి తదితరులు ఇతర పాత్రధారులు. ఛాయాగ్రహణం: సాయిశ్రీరామ్‌, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, నిర్మాత: కె.వేణుగోపాల్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X