స్వదేశ్ ( 'సుకుమారుడు' ప్రివ్యూ)
హైదరాబాద్ : సౌదామినీ క్రియేషన్స్ పతాకంపై ఆది(సాయికుమార్ కొడుకు) హీరోగా కె. వేణుగోపాల్ నిర్మించిన చిత్రం 'సుకుమారుడు'. 'పిల్ల జమీందారు' ఫేమ్ అశోక్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఈ రోజు( శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కుటుంబ కథా చిత్రంగా ఈ సినిమా ఇప్పటికే క్రేజ్ తెచ్చుకుంది. ఆది కెరీర్ లో నే పెద్ద బడ్జెట్ గా...దాదాపు ఏడున్నర కోట్ల రూపయాల బడ్జెట్ తో నిర్మితమైందని సమాచారం.
అమెరికా నుంచి వచ్చిన మనవణ్ని చూసిన ఆ పెద్దాయనకు తన టీనేజ్ గుర్తుకొచ్చింది. పాశ్చాత్య సంస్కృతిలో పెరిగిన ఆ అబ్బాయికి తెలుగుదనాన్ని ఎలా రుచి చూపించారు? ఇక్కడి పద్ధతులకు ఆ అల్లరి కుర్రాడు అలవాటుపడ్డాడో లేదా అనే కాన్సెప్టుతో ఈ చిత్రం రూపొందింది.
సినిమాలో నా పేరు సుకుమార్. పేరుకే సుకుమారుడు కానీ అసలు కుటుంబ సంబంధాలు పట్టనివాడు. తన ఎదుగుదలే ముఖ్యం అనుకొనే తత్వం ఉన్నవాడు. అలాంటి కుర్రాడికి ప్రేమానురాగాల విలువ ఎలా తెలిసిందన్నది కథలో కీలకాంశం.
ఇక ఇందులో నేను సుకుమార్ అనే ఎన్నారై పాత్ర చేశాను. దర్శకుడు అశోక్ నా పాత్రను కొత్తగా డిజైన్ చేశారు. పాత్రలో పలు ఛాయలుంటాయి. పేరుకు మాత్రమే 'సుకుమారుడు'. కానీ అందుకు విరుద్ధంగా నడిచే స్వార్థపరుడు. అలాంటి వాడు సుకుమారుడుగా ఎలా మారాడన్నదే కథ. నా మునుపటి సినిమా 'లవ్‌లీ'లో చేసిన క్లైమాక్స్ సీన్ సుకుమార్ పాత్రని సమర్థవంతంగా చేయడానికి సాయపడింది అని చెప్పుకొచ్చారు.
బ్యానర్ : సౌదామినీ క్రియేషన్స్
నటీనటులు: ఆది, నిషా అగర్వాల్, నీలం ఉపాధ్యాయ, సూపర్‌స్టార్ కృష్ణ, శారద, బ్రహ్మానందం, గొల్లపూడి మారుతీరావు, తనికెళ్ల భరణి, ఎమ్మెస్ నారాయణ, రావురమేష్, శ్రీనివాస్ అవసరాల, అజయ్, ధన్‌రాజ్, తాగుబోతు రమేష్ తదితరులు.
సంగీతం: అనూప్ రూబెన్స్,
కెమెరా: సాయిశ్రీరామ్,
ఎడిటింగ్: ప్రవీణ్‌పూడి,
మాటలు: చంద్రశేఖర్ గుండిమెడ,
ఆర్ట్: రామ్,
డాన్స్: జులాయి శేఖర్,
కో ప్రొడ్యూసర్: బాబ్జీ,
సమర్పణ: కె.వి.వి.సత్యనారాయణ,
నిర్మాత: కె.వేణుగోపాల్,
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అశోక్ జి.


Click it and Unblock the Notifications












