Don't Miss!
- Technology యూట్యూబ్‌కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆది ‘సుకుమారుడు’ తాజా వివరాలు
హైదరాబాద్: లవ్లీ రాక్ స్టార్ ఆది హీరోగా, పిల్ల జమిందార్ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన యువ దర్శకుడు అశోక్ జి. దర్శకత్వంలో శ్రీ సౌదామిని క్రియేషన్స్ పతాకంపై సీనియర్ ప్రొడ్యూసర్ కె.వి.వి.సత్యనారాయణ సమర్పణలో కె. వేణుగోపాల్ నిర్మిస్తున్న 'సుకుమారుడు' చిత్రం ఇటీవలే ఫారిన్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా చిత్ర సమర్పకులు కె.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ...'ఇటీవల యూరఫ్ లో మొత్తం 15 రోజులు షూటింగ్ చేసాం. అక్కడ రెండు పాటలతో పాటు, 32 సీన్స్ చేసాం. ఈ ఫారిన్ షెడ్యూల్ లో హీరో హీరోయిన్లు ఆది, నిషా అగర్వాల్ తో పాటు హీరో పి.ఎ.గా అక్కడి లోకల్ ఆర్టిస్ట్ ఒక అమ్మాయి చేసింది. ఫారిన్లో తీసిన రెండు పాటలు కూడా చిత్రానికి హైలెట్ అవుతాయి. ఒక పాటను మంచు కప్పబడిన ఇళ్ల మధ్య ఓ అద్భుతమైన ప్రదేశంలో 5 రోజులు చేసాం. ఆహ్లాదకరమైన లొకేషన్ అది. ఆ లొకేషన్ లో అప్పటికప్పుడు మంచు కురుస్తుంది. సడెన్ గా వర్షం కురుస్తుంది. ఆ మంచుని ఆ వర్షాన్ని మా కెమెరామెన్ శ్రీరామ్ చక్కగా పిక్చరైజ్ చేసారు' అని వెల్లడించారు.
నవంబర్ 19 నుంచి హైదరాబాద్ లో షెడ్యూల్ మొదలైందని, దీని తర్వాత పూణెలో ఓ పాట కొన్ని సీన్స్ చిత్రీకరించడంతో షూటింగ్ పూర్తవుతుంది. ఆల్ రెడీ పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. డిసెంబర్లో ఆడియో రిలీజ్ చేస్తాం. ప్రేమకావాలి, లవ్ లీ వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన ఆదికి ఇది మరో సూపర్ డూపర్ హిట్ సినిమా అవుతుంది. ఊర్వశి శారద కీలకమైన పాత్ర పోషిస్తున్న ఈచిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ గారు స్పెషల్ అప్పీయెరెన్స్ ఇవ్వడం మరో విశేషమని నిర్మాత తెలిపారు.
లవ్ లీ రాక్ స్టార్ ఆది, నిషా అగర్వాల్, భావన ముఖ్య పాత్రలో ఊర్వశి శారద, ఓ ప్రత్యేక పాత్రలో సూపర్ స్టార్ కృష్ణ నటిస్తున్న ఈ చిత్రంలో ఎం.ఎస్.నారాయణ, తనికెళ్ల భరణి, రావు రమేష్, చలపతిరావు, సంజయ్, తాగుబోతు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, ఫొటోగ్రఫీ: శ్రీరామ్, ఎడిటింగ్: ప్రదీప్, ఆర్ట్: రామ్, డాన్స్: జులాయి శేఖర్, కో ప్రొడ్యూసర్: బాబ్జీ, సమర్పణ: కె.వి.వి.సత్యనారాయణ, నిర్మాత: కె.వేణుగోపాల్, కథ, స్ర్కీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: అశోక్ జి.