శ్రీను వైట్ల చేతుల మీదుగా ‘సుకుమారుడు’ షురూ..
ఆది, నిషా అగర్వాల్ జంటగా పిల్ల జమిందార్ ఫేం జి. అశోక్ దర్శకత్వంలో శ్రీ సౌదామిని క్రియేషన్స్ బ్యానర్‌పై కె.వి.వి సత్యానారాయణ సమర్పణలో కె వేణుగోపాల్ నిర్మిస్తున్న చిత్రం 'సుకుమారుడు'. ఈ చిత్రం ప్రారంభోత్సవం ఈ రోజు హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో జరిగింది. తొలి షాట్‌కి శ్రీను వైట్ల క్లాప్ ఇవ్వగా, కె.ఎస్. రామారావు కెమెరా స్విచ్చాన్ చేశారు. జయ.బి గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ...'ఈ చిత్రంలో హీరో పేరుకే సుకుమారుడు. ప్రజెంట్ ట్రెండ్‌కి దగ్గరగా ఉండే క్యారెక్టర్‌ను ఆది చేస్తున్నాడు. 70 మంది కుటుంబం గల ఇంట్లో అందమైన, అమాయకమైన గారాల పట్టిగా శాంకరి అనే పేరుతో నిషా నటిస్తోంది. ఫ్యామిలీ డ్రామా, లవ్ స్టోరీ, కలిగిన చిత్రమిది. జూన్ మొదటి వారంలో ఫస్ట్ షెడ్యూల్ విజయనగరంలో ప్రారంభిస్తాం' అని తెలిపారు.
హీరో ఆది మాట్లాడుతూ..నన్ను హీరోగా పరిచయం చేసిన ఆర్.ఆర్ వెంకట్ గారికి నేనెప్పటీ రుణపడి ఉంటాను. 60 మంది ఆర్టిస్టుల మధ్య మొదటి సారిగా నటిస్తున్నాను. మరోసారి నా సినిమాకి అనూప్ మ్యూజిక్ ఇస్తున్నారు. మా కాంబినేషన్లో ప్రేమకావాలి, లవ్ లీ చిత్రాలు సూపర్ హిట్టయ్యాయి. ఈ సినిమాతో నేను హాట్రిక్ కొడతానని నమ్మకంగా చెప్పగలను. ఎందుకంటే అశోక్ ఫ్యాషన్ గల దర్శకుడు. అతడు చెప్పిన కథ నాకు ఎంతో నచ్చిందని చెప్పాడు. నిర్మాత మాట్లాడుతూ మా సినిమాకి మంచి టీం దొరికింది. ఆది ఎనర్జిటిక్ హీరో. ఈ సినిమా 100 శాతం సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉందన్నారు.
ఈ చిత్రంలో శారద, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, రావు రమేష్, ధనరాజ్, గొల్లపూడి మారుతీరావు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మాటలు: చంద్రశేఖర్ గుండెమేడ, ఆర్ట్: ఎ. రామాంజనేయులు, సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్, సంగీతం: అనూప్ రూబెన్స్, సహ నిర్మాత: బాబ్జి, నిర్మాత: కె. వేణుగోపాల్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: జి అశోక్.


Click it and Unblock the Notifications











