»   » కాబోయే భార్య ఫోటోలు షేర్ చేసిన హీరో ఆది (పిక్చర్స్)

    కాబోయే భార్య ఫోటోలు షేర్ చేసిన హీరో ఆది (పిక్చర్స్)

    By Bojja Kumar

    హైదరాబాద్: ప్రేమ కావాలి', ‘లవ్లీ', ‘సుకుమారుడు', ‘గాలిపటం' చిత్రాల్లో నటించిన తెలుగు హీరో ఆది త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 3వ తేదీన అరుణ(సాఫ్ట్ వేర్ ఉద్యోగిని) అనే అమ్మాయితో ఆది నిశ్చితార్థం కూడా జరిగింది. తనకు కాబోయే భార్య ఫోటోలను ఆది తన సోషల్ నెట్వర్కింగ్ పేజీ ద్వారా షేర్ చేసారు.

    ఎంగేజ్మెంట్ గురించి ఆది మాట్లాడుతూ...‘నా ఎంగేజ్మెంట చాలా చిన్నగా జరిగింది, ఫిల్మ్ ఇండస్ట్రీలోని నా స్నేహితులను కూడా పిలవలేదు. డిసెంబర్ 13న పెళ్లి డేట్ ఫిక్సయింది. పెళ్లిని మాత్రం గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నాం. అందరినీ ఇన్వైట్ చేస్తాను' అని తెలిపాడు.

     

    డిసెంబర్ 13వ తేదీన ఆది-అరుణ వివాహం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆది తండ్రి, నటుడు సాయి కుమార్‌కు తెలుగుతో పాటు ఇతర పరిశ్రమల ప్రముఖలతో కూడా పరిచయాలు ఉండటంతో సౌతిండియా నుండి సినీ ప్రముఖులంతా ఈ పెళ్లి వేడుకకు హాజరవుతారని తెలుస్తోంది.

    స్లైడ్ షోలో ఆది-అరుణ ఫోటోలు...

    ఆది-అరుణ

    ఆది-అరుణ

    ఎగేజ్మెంట్ తర్వాత తనకు కాబోయే భార్య అరుణ ఫోటోను ఆది షేర్ చేసాడు.

    ఎంగేజ్మెంట్ ఫోటో

    ఎంగేజ్మెంట్ ఫోటో

    తాజాగా ఎంగేజ్మెంటుకు సంబంధించిన ఫోటోలు షేర్ చేసాడు ఆది.

    చూడ చక్కని జంట

    చూడ చక్కని జంట

    ఆది - అరుణ జంటను చూసిన వారంతా ఈ జంట చూడచక్కని జంట అంటూ ప్రశంసిస్తున్నారు.

    వివాహానికి భారీ ఏర్పాట్లు
     

    వివాహానికి భారీ ఏర్పాట్లు

    డిసెంబర్ 13న జరిగే వివాహ వేడుకకు భారీ ఎత్తు ఏర్పాట్లు చేస్తున్నారు

     

     

    Please Wait while comments are loading...

    Telugu Photos

    Go to : More Photos
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X