twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆది ‘రఫ్’ఎంతవరూ వచ్చింది?

    By Srikanya
    |

    హైదరాబాద్ : రీసెంట్ గా సుకుమారుడు చిత్రంతో ఫ్లాప్ కొట్టిన ఆది తాజా చిత్రం 'రఫ్'. ఆది, రకులీప్రీతిసింగ్ జంటగా శ్రీదేవి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మాధవరం అభిలాష్ నిర్మాతగా సి.హెచ్.సుబ్బారెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ఒక పాట మినహా టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది.

    దర్శకుడు మాట్లాడుతూ- ''ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ రామానాయుడు స్టూడియోలో జరుపుతున్నాం. ఈ చిత్రం ఆదికి మరింత మంచి గుర్తింపుని తెచ్చుపెడుతుందన్న నమ్మకం వుంది. మా బ్యానర్‌కు కూడా ఈ చిత్రం ద్వారా మంచి గుర్తింపు లభిస్తుంది. ఒక పాట మినహా చిత్రం టాకీపార్ట్ మొత్తం పూర్తయింది. ఈ చిత్రానికి మణిశర్మ అందించిన ఐదు పాటలు ఆణిముత్యాల్లా వున్నాయి. ఈ పాటలు శ్రోతలను విశేషంగా అలరించనున్నాయి. త్వరలోనే ఆడియోను విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాం. నిర్మాత చక్కటి సహాకారంతో చిత్రాన్ని త్వరగా పూర్తి చేశాం'' అని చెప్పారు.

    నిర్మాత మాధవరం అభిలాష్ మాట్లాడుతూ-'' లవ్‌లీ చిత్రం ద్వారా ఆది నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. సాయికుమార్ తనయుడిగానే గాక, ఒక నటుడుగా ఆది తనని తాను నిరూపించుకుంటున్నాడు. ఆయన చేస్తున్న చిత్రాలు, అందులోని పాత్రలను చూస్తుంటే ఆదికి ఎంతో భవిష్యత్తు ఉందనిపిస్తుంది. మా ఈ 'రఫ్' చిత్రం కూడా ఆదికి మంచి ఇమేజ్‌ని తెచ్చిపెడుతుందన్న నమ్మకం మాకుంది. దర్శకుడు చిత్రాన్ని తీర్చిదిద్దిన తీరు బావుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం''అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, నిర్మాత:మాధవరం అభిలాష్, దర్శకత్వం: సి.హెచ్.సుబ్బారెడ్డి.

    English summary
    
 Hero aadi’s ‘Sukumarudu’ could not show its mark at the box office. However, this time the young hero appears to do something that fetches him mass hero image. His upcoming film has been titled as ‘Rough’. Touted to be an action romantic entertainer,Srihari will be playing an important role in this movie while ‘Keratam’ fame, Rakul Preet Singh is doing opposite to aadi in the film. Manisharma is scoring the music of the movie. Directed by Subba Reddy the movie is being produced by Abhilash Madhavaram under Sridevi Entertainments.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X