Don't Miss!
- Sports SRH vs RCB: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆది ‘రఫ్’ఎంతవరూ వచ్చింది?
హైదరాబాద్ : రీసెంట్ గా సుకుమారుడు చిత్రంతో ఫ్లాప్ కొట్టిన ఆది తాజా చిత్రం 'రఫ్'. ఆది, రకులీప్రీతిసింగ్ జంటగా శ్రీదేవి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మాధవరం అభిలాష్ నిర్మాతగా సి.హెచ్.సుబ్బారెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ఒక పాట మినహా టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది.
నిర్మాత మాధవరం అభిలాష్ మాట్లాడుతూ-'' లవ్లీ చిత్రం ద్వారా ఆది నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. సాయికుమార్ తనయుడిగానే గాక, ఒక నటుడుగా ఆది తనని తాను నిరూపించుకుంటున్నాడు. ఆయన చేస్తున్న చిత్రాలు, అందులోని పాత్రలను చూస్తుంటే ఆదికి ఎంతో భవిష్యత్తు ఉందనిపిస్తుంది. మా ఈ 'రఫ్' చిత్రం కూడా ఆదికి మంచి ఇమేజ్‌ని తెచ్చిపెడుతుందన్న నమ్మకం మాకుంది. దర్శకుడు చిత్రాన్ని తీర్చిదిద్దిన తీరు బావుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం''అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, నిర్మాత:మాధవరం అభిలాష్, దర్శకత్వం: సి.హెచ్.సుబ్బారెడ్డి.