హీరో ఆది పెళ్లి డేట్ ఫిక్స్, ఫ్రెండ్స్‌కు నో ఇన్విటేషన్!

By Bojja Kumar

హైదరాబాద్: ‘ప్రేమ కావాలి', ‘లవ్లీ', ‘సుకుమారుడు', ‘గాలిపటం' చిత్రాల్లో నటించిన తెలుగు హీరో ఆది త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. ఇటీవలే అరుణ(సాఫ్ట్ వేర్ ఉద్యోగిని) అనే అమ్మాయితో ఆది నిశ్చితార్థం కూడా జరిగింది. ఈ విషయాన్ని ఆది స్వయంగా వెల్లడించారు. ‘నా ఎంగేజ్మెంట చాలా చిన్నగా జరిగింది, ఫిల్మ్ ఇండస్ట్రీలోని నా స్నేహితులను కూడా పిలవలేదు. డిసెంబర్ 13న పెళ్లి డేట్ ఫిక్సయింది. పెళ్లిని మాత్రం గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నాం. అందరినీ ఇన్వైట్ చేస్తాను' అని తెలిపాడు.

ప్రస్తుతం ఆది ‘గరం' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా వివరాల్లోకి వెళితే..., 'పెళ్లైన కొత్తలో', 'గుండె ఝల్లుమంది', 'ప్రవరాఖ్యుడు' చిత్రాల ఫేం మదన్ దర్శకత్వంలో ఆర్.కె.స్టూడియోస్ పతాకంపై ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుమార్ ఎం. నిర్మిస్తున్న చిత్రం 'గరం'. ఇటీవలే రామానాయుడు స్టూడియోలో ప్రారంభోత్సవం. ఆది సరసన ఆదాశర్మ కథానాయికగా నటిస్తోంది.

Aadi to wed Dec 13

సినిమా గురించి ఆది తెలియజేస్తూ ''టైటిల్ చాలా హాట్‌గా ఉంది. స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుంది. సంభాషణలు కూడా చాలా బాగుంటాయి. శ్రీనివాస్ మంచి కథ ఇచ్చారు. ఈ చిత్రం ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది'' అన్నారు. మదన్ మాట్లాడుతూ ...'నా అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ ఈ కథ అందించారు. చాలా బాగుంది. నిర్మాతకు ఇది తొలి సినిమా అయినప్పటికీ ఫిలిం మేకింగ్ మీద చాలా క్లారిటీ ఉంది. సమస్యలను అలవోక గా అధిగమించి ముందుకు సాగే ఓ కుర్రాడి కథ ఇది. ప్రేమతో దేన్నయినా సాధించొచ్చన్నది ప్రధాన ఇతివృత్తం. వినోద ప్రధానంగా సాగే చిత్రం ఇది'' అని తెలిపారు.

సెప్టెంబర్ 15నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. అక్టోబర్‌లో ఓ వారం గ్యాప్ తీసుకుని రెండో షెడ్యూల్ ఆరంభించనున్నారు. మూడు పాటలను ఫారిన్ లో చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈచిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి డిసెంబర్ రెండు లేదా మూడో వారంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి కథ, మాటలు - శ్రీనివాస్ గవిరెడ్డి, కెమెరా - సురేందర్ రెడ్డి.టి, సంగీతం - ఆగస్త్య, కళ - నాగేంద్ర, ఎడిటింగ్ - కార్తీక్ శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత - బి.నాగిరెడ్డి, లైన్ ప్రొడ్యూసర్: హరికృష్ణ జి., కో-డైరెక్టర్ - అనిల్, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - మదన్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X