ఆదివారం ఆడవాళ్లకు సెలవు

By Staff

ఆఫీసుల్లో పనిచేసేవాళ్లకు క్యాజువల్‌ లీవులూ, సిక్‌ లీవులూ, హాలిడేలు, ఇంకా పెయిడ్‌ హాలిడేలు, వారాంతంలోని శని, ఆదివారాల సెలవులూ.. వెరసి ఎలా చూసినా సంవత్సరంలో కనీసం 50 రోజుల నుంచి రెండు నెలల వరకూ జాలీగా గడిపే అవకాశం ఉంటుంది. అదే ఇంటిపట్టున ఉండే ఆడవాళ్ల సంగతి? ఇంట్లో అందరికీ సెలవైన రోజు గృహిణులకు మరింత భారం. పని రోజుల్లో అయితే మొగుళ్లకి, పిల్లలకీ కాఫీలు, టిఫిన్లు, లంచ్‌కి భోయినాలు, రాత్రి ప్రత్యేక వంటకాలు.. ఇవి కాక బట్టలు, ఇల్లు సర్దడం, కూరలు, సరుకులు.. చాకిరి.. చాకిరి.. చాకిరి..

ఇంతలేసి ఇంటెడు చాకిరీని ఒంటి చేత్తో చేసే ఆడవాళ్లకు మాత్రం రోగమో, రొచ్చో వస్తే తప్ప కాస్తంత విశ్రాంతి తీసుకునే వీలే లేదు. మరి వీళ్లకి మాత్రం వారానికో రోజు సెలవు అక్కర్లేదా? వంటింటి కుందేళ్లలా వాళ్లు జీవితాంతం మొగుళ్లకీ, పిల్లలకీ, వాళ్ల పిల్లలకీ సేవలు చేస్తుండవలసిందేనా? ఆకాశంలో సగం అంటూ అభివర్ణించే జీవిత భాగస్వాములకు సుఖదుఃఖాలలో దుఃఖం మాత్రమే దక్కుతోందా? కష్ట సుఖాలలో కష్టం మాత్రమే మిగులుతోందా?

సరిగ్గా ఈ పాయింట్‌ ఆధారంగానే కేంద్ర మంత్రివర్యులు దాసరి నారాయణరావు ఒక కథ రాయడం, ఆయన శిష్యుడు రాజావన్నెం రెడ్డి దానిని తెరకెక్కించడం జరిగిపోతున్నాయి. టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రం విడుదలైన తర్వాత మాకూ ఆదివారంనాడు సెలవు కావాలి అంటూ ఆడవాళ్లంతా ధర్నాలు చేసినా ఆశ్చర్యం లేదని అంటున్నారు దర్శకుడు రాజా వన్నెంరెడ్డి. ఇలాంటి సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం దక్కడం నిజంగా నా అదృష్టం అంటున్నారాయన.

మంగా మూవీ మేకర్స్‌ పతాకంపై లీలారాణి వన్నెంరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్‌ ఇటీవలే పూర్తయింది. మూడో షెడ్యూల్‌ నవంబర్‌ 15 నుంచి ప్రారంభం అవుతుంది. ఒకలా ఇది చాలా సీరియస్‌ ఇతివృత్తమే అయినప్పటికీ చాలా వినోదభరితంగా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు.

ఈ చిత్రంలో దాసరి నారాయణరావు సైతం క్లయిమాక్స్‌లో కనిపించబోతున్నారన్నది తాజా సమాచారం. శివాజీ, సుహాసినీ, బ్రహ్మానందం, కోవై సరళ, రజిత, రఘుబాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం వందేమాతరం శ్రీనివాస్‌.

మరిన్నికథనాలు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X