ఏడాదిన్నరపాటు అన్నం తినని తెలుగు హీరో

By Srikanya

హైదరాబాద్ : మహేష్ బాబు సోదరి భర్త...బావ అయిన ఎస్‌ఎమ్‌ఎస్‌ ఫేం సుధీర్‌బాబు, అస్మితా సూద్ జంటగా... రూపొంది విడుదలకు సిద్దంగా ఉన్న చిత్రం 'ఆడు మగాడురా బుజ్జీ‌' . పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం కోసం హీరో సుధీర్ బాబు బాగా కష్టపడ్డారని తెలుస్తోంది. ముఖ్యంగా సిక్స్ ప్యాక్ పెంచటం కోసం ఆయన ఏడాదిన్నరపాటు అన్నం కూడా తీసుకోకుండా గడిపారు. ఈ చిత్రం వచ్చే నెల7 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

నిర్మాతలు మాట్లాడుతూ "సుధీర్‌బాబు చాలా కష్టపడి సిక్స్‌ప్యాక్ చేశారు. ఎలాంటి ఉత్ప్రేరకాలను తీసుకోకుండా దాదాపు మూడేళ్లు కఠోరంగా శ్రమించారు. ఏడాదిన్నరపాటు అన్నం కూడా ముట్టకుండా కేవలం కూరగాయలు, పండ్లముక్కలే తీసుకుని, రోజుకు 14 గంటల చొప్పున కష్టపడి సిక్స్‌ప్యాక్‌ను పెంచారు. ఆయన సిక్స్‌ప్యాక్ మా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ చిత్రంతో సుధీర్‌బాబుకు హ్యాట్రిక్ హిట్ ఖాయం. సెన్సార్ పూర్తయింది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్లకు, పాటలకు చాలా మంచి స్పందన వస్తోంది'' అని తెలిపారు.


హీరోయిన్ అస్మితా సూద్ మాట్లాడుతూ.. '' 'ఆడు మగాడ్రా బుజ్జీ' లో నా పాత్ర చిత్రణ నేటి తరం అమ్మాయిలకు ప్రతీకగా ఉంటుంది. ఇందులో సుధీర్‌ ఓ కుక్కతో మాట్లాడుతుంటాడు. అదెందుకనేది సస్పెన్స్‌'' అంటూ సినిమా గురించి చెప్పుకొచ్చింది. నా తొలి సినిమా 'బ్రహ్మిగాడి కథ' తర్వాత నాకు చాలా అవకాశాలొచ్చాయి. అయితే వెంటనే దేన్నీ అంగీకరించలేదు. మంచి పాత్రలు చేయాలనే ఉద్దేశంతోనే ఇన్నాళ్లు ఆగాను. అలా ఆలోచించి చేసిన సినిమానే 'ఆడు మగాడ్రా బుజ్జీ'. మంచి హీరోయిన్ గా నాకు పేరు తెచ్చే సినిమా అవుతుంది'' అన్నారు

కథ గురించి చెప్తూ...కాలేజీలో అందమైన అమ్మాయిని నేను. అయితే నా వైపు చూడటానికి అబ్బాయిలు భయపడుతుంటారు. దానికి కారణం మా అన్నయ్య. అతను కాలేజీలో డాన్‌. అయితే సుధీర్‌ మాత్రం నా కోసమే కాలేజీకొస్తాడు. నన్ను ప్రేమిస్తాడు. అయితే దాని వెనుక మాత్రం పెద్ద కారణముంటుంది. అది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇలాంటి సినిమాలు ఇప్పటికే చాలా వచ్చుంటాయి. వాటిలో ఇది భిన్నంగా ఉంటుంది. ''అన్నారు అస్మిత.

ఈ చిత్రం లో హీరో కుక్కతో మాట్లాడుతూండటం హైలెట్ అని తెలుస్తోంది. ఆ సీన్స్ ఫుల్ కామెడీ పండిస్తాయని,తెలుగు తెరపై ఇలాంటి కామెడీ చూడలేదని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. సుమన్, నరేష్, సంధ్యా జనక్, లక్ష్మి, రణ్‌ధీర్, సాయి, కృష్ణభగవాన్, పృథ్విరాజ్, సుమన్‌శెట్టి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీ, కథ: కృష్ణాడ్డి గంగదాసు, లంకపల్లి శ్రీనివాస్, కెమెరా: శాంటోనియో ట్రిజియో, పాటలు: పద్మశ్రీ, నక్కా రామకృష్ణ, పాటలు: అనంతశ్రీరామ్, కృష్ణచైతన్య, చిర్రావూరి విజయ్‌కుమార్, నిర్మాతలు:సుబ్బారెడ్డి, ఎస్.ఎన్.రెడ్డి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కృష్ణారెడ్డి గంగదాస్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X