అయ్యో పాపం! అదీ మహేష్ బావ సుధీర్ బాబు పరిస్థితి!
హైదరాబాద్: సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు, మహేష్ బాబు బావ అనే వారసత్వం ట్యాగ్ తగిలించుకుని సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబు తొలి సినిమా 'ఎస్ఎంఎస్'తో జస్ట్ ఓకే అనిపించుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన 'ప్రేమ కథా చిత్రం' సుధీర్ బాబుకు బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమాతో వారసత్వం అనే ముద్ర తొలగించుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
ప్రస్తుతం సుధీర్ బాబు 'ఆడు మగాడ్రా బుజ్జి' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ఆడియో వేడుక బుధవారం హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకు మహేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. అయితే ఇక్కడ ఓ విచిత్ర పరిస్థితి నెలకొంది. సాధారణంగా ఏ హీరో ఆడియో ఫంక్షన్ అయినా....అంతా ఆ చిత్ర హీరో గురించే మాట్లాడతారు.
కానీ ఇక్కడ పరిస్థితి పూర్తిగా భిన్నంగా సాగింది. యాంకర్ ఝాన్సీ వేదికపై మొత్తం మహేష్ బాబు భజనే చేసింది. అసలు ఈ సినిమా ఫంక్షన్ సుధీర్ బాబుది అనే విషయమే మరిచి పోయింది. మహేష్ బాబు తర్వాత కూడా హీరోయిన్లకు ప్రాధాన్యత ఇచ్చారే తప్ప సుధీర్ బాబును పెద్దగా పట్టించుకున్నది లేదు. దీంతో సుధీర్ బాబు కాస్త అవమానంగా ఫీలయ్యాడనేది సినిమా యూనిట్ సభ్యుల ఇన్ సైడ్ టాక్.
ఇక సినిమా వివరాల్లోకి వెళితే...కలర్స్ అండ్ క్లాప్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కృష్ణారెడ్డి గంగదాసు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఆడు మగాడ్రా బుజ్జీ'. సుధీర్‌బాబు, పూనం కౌర్, అస్మితా సూద్ ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సుబ్బారెడ్డి, ఎస్.ఎన్.రెడ్డి రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం:శ్రీ, కెమెరా:శాంటోనియో ట్రె జియో, ఆర్‌ట:నారాయణరెడ్డి, నిర్మాతలు:సుబ్బారెడ్డి, ఎస్.ఎన్.రెడ్డి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కృష్ణారెడ్డి గంగదాస్.


Click it and Unblock the Notifications












