ఆద్య అంత పని చేసిందా?.. రేణూ దేశాయ్‌ను అలా బుక్ చేసేసింది!
రేణూ దేశాయ్ తన పిల్లల గురించి సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంటుంది. అకీరా నందన్, ఆద్యలు చేసే అల్లరి గురించి తన అభిమానులు, ఫాలోవర్స్ గురించి చెబుతూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆద్య చేసే పనుల గురించి ప్రత్యేకంగా వివరిస్తూ ఉంటుంది. ఇంట్లో చేసే అల్లరి, వంట, క్లిక్ మనించే ఫోటోల గురించి, ఆమె ప్రతిభ గురించి ఏదో ఒకటి నిత్యం పోస్ట్ చేస్తూనే ఉంటుంది. తాజాగా తనను ఆద్య ఎలా బుక్ చేసిందో కూడా వివరించింది.

సోషల్ మీడియాలో హల్చల్..
ప్రస్తుతం రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఫుల్ హల్చల్ చేస్తోంది. ప్రకృతికి సంబంధించిన ఫోటోలు, మూగ జీవాలకు సంబంధించిన ఫోటోలు లేదా వెకేషన్‌కు వెళ్లిన ప్రదేశాల్లో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ హల్చల్ చేస్తూ ఉంటుంది. అయితే తాను షేర్ ఫోటోలు దాదాపు అన్నీ ఆద్య తీసినవే అని చెప్పుకొచ్చింది.

ఆద్య స్పెషల్ టాలెంట్..
ఆద్యకు గల ఫోటోగ్రఫీ టాలెంట్ గురించి రేణూ దేశాయ్ నిత్యం ఏదో ఒక సంగతి చెబుతూనే ఉంటుంది. ఆ మధ్య రేణూ దేశాయ్ తన ఫోటోలను షేర్ చేస్తూ ఆద్య తీసిన ఫోటోలు అంటూ తెలిపింది. ఎప్పుడూ కెమెరా, ఫోన్ వెంటబెట్టుకునే ఉంటుందని, ఫోటోలు బాగా తీస్తుందని చెప్పుకొస్తూ ఉంటుంది.అయితే అకీరా మాత్రం అలాంటి పనులేవీ చేయడని, కూతురు టాలెంట్‌ను అందరికీ పరిచయం చేసింది.

కుకింగ్‌లోనూ ప్రత్యేకమే..
ఆద్య ఫోటోగ్రఫీలోనూ కాదు కుకింగ్‌లోనూ ప్రత్యేకమే అట. ఈ విషయాన్ని రేణూ దేశాయ్ స్వయంగా తెలిపింది. ఆద్య తయారు చేసిన కేక్‌కు ఎంత ఫాలోయింగ్ ఉందో వివరించింది. ఇక రీసెంట్‌గా ఇంట్లోనే ఓ చెఫ్‌ను పెట్టుకుని కొంత వంటకాలను నేర్చుకుంటోందట.
Recommended Video

కునుకు తీస్తుండగా ఫోటో..
తాజాగా ఆద్య రేణూ దేశాయ్‌ను భలే బుక్ చేసింది. రేణూ దేశాయ్ చిన్నగా కునుకు తీస్తుండగా చెప్పకుండానే ఓ ఫోటోను తీసిందట. ఇదే విషయాన్ని రేణూ దేశాయ్ చెబుతూ.. నేను, నా ప్రతిబింబం కునుకు తీస్తుండగా ఆద్యకు చిక్కాము. నేను నిజంగా కునుకు తీస్తున్నాను.. పోజ్ ఇవ్వలేదని వివరణ ఇచ్చుకుంది కూడా. ఇలా ఆద్య చిలిపి పనులతో రేణూ దేశాయ్‌ను బాగానే ఆట పట్టిస్తోంది.


Click it and Unblock the Notifications











