బ్రహ్మానందం నెత్తిపై మహేష్ మొట్టుతూ (వీడియో)

By Srikanya

హైదరాబాద్: బ్రహ్మానందం,మహేష్ కాంబినేషన్ ని ...దూకుడు చూసిన వారు ఎవరూ మర్చిపోలేరు. ఇద్దరూ ఒకరికి మించిన టైమింగ్ తో మరొకరు కామెడీ గా తెరపై రచ్చ రచ్చ చేసేస్తారు. ఇప్పుడు ఇలాంటిదే మరోసారి జరగబోతోందని శ్రీనువైట్ల సిగ్నల్స్ ఇస్తున్నారు.

మహేష్‌ హీరోగా నటించిన సినిమా 'ఆగడు'. శ్రీనువైట్ల దర్శకత్వం వహించారు. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తున్నారు. ఈ కాంబినేషన్‌లో 'దూకుడు' తర్వాత వస్తున్న సినిమా 'ఆగడు' కావటంతో చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం కొత్త టీజర్ ని రీసెంట్ గా విడుదల చేసారు. ఎంటర్టైన్మెంట్ తో నిండిన ఈ టీజర్ కి మంచి అప్లాజ్ వస్తోంది. ఈ టీజర్ లో బ్రహ్మానందంపై ఎక్కువ కాన్సర్టేట్ చేయటం విశేషం.

దర్శకుడు మాట్లాడుతూ ‘‘మహేష్‌బాబు పెర్‌ఫార్మెన్స్‌, హీరో పాత్ర ‘ఆగడు'లో మెయిన్‌ హైలైట్స్‌. మహేష్‌బాబులో ఇంతకు ముందు చూడని కొత్త షేడ్స్‌ను ‘ఆగడు'లో చూస్తారు. ఆయన కామెడీ టైమింగ్‌ బావుంటుంది. అభిమానుల్లో ‘ఆగడు' పండగ వాతావరణాన్ని క్రియేట్‌ చేస్తుంది'' అని తెలిపారు. శ్రీను వైట్ల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన తమన్నా జోడీ కట్టింది. శృతి హాసన్ ఓ స్పెషల్ సాంగ్ లో కనిపిస్తున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందించాడు.

AAGADU 30 SEC Entertainment PROMO

నిర్మాతలు మాట్లాడుతూ ‘‘ఈ నెల 19న సినిమాను విడుదల చేస్తున్నాం. ఇటీవల విడుదలైన పాటలకు, మా ట్రైలర్లకు మంచి స్పందన వస్తోంది'' అని అన్నారు. ఈ సినిమాకు రచన: అనిల్‌ రావిపూడి, ఉపేంద్ర మాధవ్‌, రచనా సహకారం: ప్రవీణ్‌ వర్మ, సంగీతం: ఎస్‌.ఎస్‌.థమన్‌, కెమెరా: కె.వి.గుహన్‌, ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఎడిటింగ్‌: ఎం.ఆర్‌.వర్మ, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: కోటి పరుచూరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X