మహేష్ అంటే పిచ్చి: జెండా పాతేంగే...(ఫోటోస్)
హైదరాబాద్: మహేష్ బాబు నటించిన ‘ఆగడు' చిత్రం విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అవుతోంది. విడుదల రోజే సినిమా చూడాలని ఫ్యాన్స్ తమ శక్తి మేర ప్రయత్నిస్తున్నారు. ఇక కాలేజీ కుర్రాళ్లయితే కాలేజీలకు బంక్ కొట్టి మరీ టిక్కెట్లు సంపాదించడానికి థియేటర్ల వద్ద క్యూ కడుతున్నారు.
హైదరాబాద్‌లోని ప్రసాద్స్ ఐమాక్స్ థియేటర్లో తొలిరోజు అత్యధిక షోలు ప్రదర్శిస్తున్నారు. దీంతో ఇతర ప్రాంతాల్లో టిక్కెట్స్ దొరకని వారు సైతం టిక్కెట్లు దొరుకుతాయనే ఆశతో ఐమాక్స్ బాట పట్టారు. మహేష్ బాబు అంటే ఎంత పిచ్చి అభిమానమో ఇలాంటి సంఘటనలు మచ్చుకు కొన్ని మాత్రమే. మరో వైపు విశాఖ సముద్ర తీరంలో ఆగడు జెండాలు పాతి సరికొత్తగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.
సినిమా రిలీజ్ సందర్భంగా అభిమానులు ఆగడు జెండాలతో ర్యాలీ నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. స్లైడ్ షోలో ఫోటోలు....

ఐమాక్స్ థియేటర్ వద్ద...
ఐమాక్స్ థియేటర్ వద్ద టిక్కెట్ల కోసం బారులు తీరిన మహేష్ బాబు అభిమానులు.

అంచనాలు భారీగానే...
మహేష్ బాబు సినిమా అంటేనే క్రేజ్ భారీగా ఉంటుంది. దూకుడు దర్శకుడు శ్రీను వైట్ల సినిమా కావడంతో అంచనాలు మరింత పెరిగాయి.

గ్రాండ్ రిలీజ్
‘ఆగడు' చిత్రాన్ని ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ భారీగా 2000 స్క్రీన్లలో విడుదల చేస్తోంది.

విశాఖ తీరంలో..
విశాఖ తీరంలో ఆగుడు జెండాలు పాతిన దృశ్యం.


Click it and Unblock the Notifications











