‘ఆగడు’ పాటలు అస్సలు ఆగడం లేదు (న్యూ ఫోటోస్)
హైదరాబాద్: మహేష్ బాబు నటించిన ‘ఆగడు' చిత్రం ఆడియో ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. లహరి మ్యూజిక్ ద్వారా ఈ పాటలను విడుదల చేసారు. ఈ ఆడియో విడుదలైన రోజు నుండే సేల్స్ పరంగా కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ సందర్భంగా లహరి మ్యూజిక్ అధినేత మనోహర్ నాయుడు ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
మనోహర్ నాయుడు మాట్లాడుతూ...‘ఈ సంవత్సరం మా సంస్థ విడుదల చేసిన ఆడియోలన్నీ పెద్ద హిట్ అయ్యాయి. లేటెస్టుగా మహేష్ బాబు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ ప్రై.లిమిటెడ్ నిర్మిస్తున్న ‘ఆగడు' ఆడియో ఇటీవల విడుదలైన అందర్నీ ఆకట్టుకుంటోంది. థమన్ సంగీత సారథ్యంలో రూపొందించిన ఈ ఆల్బమ్‌లోని అన్ని పాటలూ ఆదరణ పొందుతున్నాయి' అన్నారు.
స్లైడ్ షోలో

ఆగడియో ఆడియో సెన్నేషన్
ఆగడు టైటిల్ సాంగ్, నారి నారి, జంక్షన్లో..., తూ ఆజా సరోజా పాటలు శ్రోతల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సంవత్సరం థమన్ చేసిన ఆడియోల్లో ‘ఆగడు' ది బెస్ట్ ఆడియోగా అందరి ప్రశంసలు అందుకుంటోంది.

సేల్స్ పరంగా
సేల్స్ పరంగా ఈ ఆడియో కొత్త రికార్డులు సృష్టిస్తోందని అన్ని ఏరియాల నుండి రిపోర్ట్ష్ వస్తున్నాయి. అలాగే డిజిటల్ కూడా చాలా హై రేంజిలో డౌన్ లోడ్స్ జరుగుతున్నాయని తెలిపారు.

థాంక్స్ చెప్పి మనోహర్ నాయుడు
వరుసగా మూడు చిత్రాలు ఆడియోలు మా లహరి ద్వారా విడుదల చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలు రామ్, గోపీ, అనిల్‌లకు మరియు కొర్రపాటి సాయి, దర్శకుడు శ్రీను వైట్లకు, సంగీత దర్శకుడు థమన్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.

ఈ సినిమా పాటలు కూడా
మా సంస్థ ద్వారా త్వరలో మల్టీ స్టారర్ ‘గోపాలా గోపాలా', మరో భారీ బడ్జెట్ చిత్రం ఆడియో విడుదల కాబోతున్నాయని మనోహర్ నాయుడు తెలిపారు.


Click it and Unblock the Notifications











